ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. అందులోనూ ఒకే పాఠశాలలో పోస్టింగ్ కావడంతో చనువు పెరిగింది. సమయం చూసి ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె నమ్మేసింది. కానీ దాని వెనుక పెద్ద కుట్ర ఉందని పసిగట్టలేకపోయింది. పవిత్రమైన ఉసాద్యాయ వృత్తిలో ఉండి తోటి ఉపాధ్యాయురాలిని ప్రేమ పేరుతో దారుణంగా మోసం చేశాడో ప్రబుద్డుడు. అతని చేసిన మోసానికి ఆవేదనకు లోనైన ఆమె విషం తాగి బలవన్మరణానికి సాల్పడింది. ఈ సంఘటన కర్ణాటకలో రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…
ఈ క్రింది వీడియోని చూడండి
చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ధనుంజయ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో రాణి అనే మరో ఉపాధ్యాయురాలు కూడా పని చేస్తోంది. టీచర్‌పై కన్నేసిన ధనుంజయ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అప్పటికే తనకు వివాహమైనా కాలేదని అబ్ధం చెప్పి ఆమెతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. కొద్దికాలం కలసి తిరిగారు. పెళ్లి చేసుకుంటానని ఆమె నుంచి రూ. లక్షల నగదు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోబోయేవాడే కదా అనుకుని అతను అడిగినంత డబ్బు ఇచ్చింది. ఇటీవల రాణికి హాసన్ జిల్లాకు బదిలీ అయ్యింది. అయితే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో ధనుంజన్ ను పెళ్లి చేసుకుందామని పలుమార్లు ధనుంజయ్ ను కోరింది. అయితే అప్పటికే పెళ్ళైన ధనుంజయ్ రాణిని పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా లేడు. దాంతో రాణి పెళ్లి మ్యాటర్ తీసినప్పుడల్లా అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానించిన రాణి తన సోదరుడు రాకేశ్ కు విషయం చెప్పింది.

దాంతో రాకేష్ ధనుంజయ్ గురించి ఆరా తీయడంతో అతనికి అప్పటికే పెళ్లి జరిగినట్లు తేలింది. దీంతో రాణి రెండు రోజుల క్రితం యల్లందూరు వచ్చి ధనుంజయ్ స్కూల్ దగ్గరకు వెళ్లి గొడవపడింది. నన్ను మోసం చేశావని నిలదీసింది. రాణి వచ్చి గొడవ పడుతున్నా కూడా ధనుంజయ్ ఎక్కడ బెదరకుండా నేను పెళ్లి చేసుకోను, నాకు ఆల్రెడీ పెళ్లయింది అని చెప్పాడు. దాంతో నిన్ను ఊరికే వదలనని హెచ్చరించి హాసన్ కు వచ్చేసింది. అయితే ధనుంజయ్ ను సిన్సియర్ గా ప్రేమించిన రాణి అతని మోసాన్ని తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెంది తన రూమ్ లోకి వెళ్లి విషం తాగింది. దీంతో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో రాణి సోదరుడు రాకేశ్ ఈ ఘటనపై బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ధనుంజయ్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ క్రింది వీడియోని చూడండి