లవ్ చేయట్లేదని మహిళా లెక్చరర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

4491

దేశంలో రోజురోజుకీ ఆడవాళ్లపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త చట్టాలు తీసుకు వస్తున్న గాని మగాడి ఆలోచనలో మార్పులు రావడం లేదు. దిశ మరియు నిర్భయ లాంటి ఘటనలు చోటు చేసుకున్న కొత్త కొత్త శిక్షలు వచ్చిన సమాజంలో మాత్రం ఆడవాళ్ళ పై దారుణాలు ఆగటం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరొక దారుణం చోటు చేసుకుంది. పెళ్లై, ఏడు నెలల కొడుకు ఉన్నప్పటికీ, తనను ప్రేమించాలంటూ మహిళా లెక్చరర్ వెంట పడటమే కాదు.. అతడి ప్రేమకు నో చెప్పిందన్న కోపంతో నడిరోడ్డు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

Maharashtra woman lecturer critical after lover sets her afire

వార్థా జిల్లా నందోరి చైక్ లో వికాన్ అనే 27 ఏళ్ల యువకుడు ఉండేవాడు. దడోరా గ్రామానికి చెందిన 26 ఏళ్ల అంకిత కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుంటారు. అయితే ఈమె తల్లిదండ్రులది, వికాన్ వాళ్ళది ఒకే ఊరు. ఇద్దరిది ఒకే ఊరి వారు కావటంతో వారిద్దరికి పరిచయం ఉంది. అయితే ఆమెకు పెళ్ళయ్యి, ఒక కొడుకు ఉన్నాడని తెలిసి కూడా వికాన్ అంకితను ప్రేమించాడు. తన ప్రేమను ఒప్పుకోవాలని అంకిత వెంట పడేవాడు. ఆమె అతని ప్రవర్తన నచ్చక పక్కన పెట్టింది. ఈ విషయం తెలిస్తే భర్త తనను ఎక్కడ ఉద్యోగం మానెయ్యమంటాడో అని భర్తకు చెప్పలేదు. దాంతో వికాన్ వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా కూడా అంకిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె మీద కోపం పెంచుకున్న వికాస్, దారుణానికి పాల్పడ్డాడు. ఆమె పని చేసే కాలేజీ దగ్గర కాపు కాచి, ఆమె వచ్చిన వెంటనే గొడవ పడ్డాడు. అంతేకాదు తన వెంట తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పంటించాడు. ఊహించని పరిణామంతో అంకిత్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు ఆమె ఒంటిని మంటలు అంటుకున్నాయి. వెంటనే వికాన్ తన టూవీలర్ మీద పారిపోయాడు. జరుగుతున్న దారుణాన్ని గుర్తించిన స్థానికులు మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె శరీరం బాగా కాలి పోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రి కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను నాగపూర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకిత 40శాతం కాలిన గాయాలతో ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడికి మరో ఇద్దరు సహకరించినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రేమ విఫలం కావటంతోనే ఇలాంటి పనికి వికాస్ పాల్పడి ఉంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. లవ్ ఫెయిల్ అయి, పెళ్లైన తర్వాత కూడా వెంట పడాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు. నిజంగా ప్రేమ అంటే.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయి బాగుండాలని కోరుకోవాలి కానీ.. ఇలా ప్రాణాలు తీయటం కాదంటున్నారు. వికాస్ కారణంగానే అంకితకు పెళ్లైనప్పటికీ, ఆమె వైవాహిక జీవితం విచ్ఛిన్నమైనట్లుగా ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation