భారతీయుడు 2 షూటింగ్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్

114

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో ఆమె నటిస్తుండటం విశేషం. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో ఇప్పుడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో వెక్కట్ట అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ భారీ ఫైట్ సీన్ కు తెరకెక్కిస్తున్నారు. అయితే అదే సమయంలో భారీ క్రేన్ విరిగిపడటంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో పదికి గాయాలయ్యాయి. డైరెక్టర్ కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి క్రింద ఉన్న టెంట్‌పై పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ ఉన్నారు. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

Image result for bharateeyudu 2 accident

ఈ దుర్ఘటనలో డైరెక్టర్ శంకర్‌ కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. శంకర్ సహా గాయపడిన వారందరినీ వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కమల్ హాసన్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల కమల్ కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసి తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. పలువురు సినీప్రముఖులు ఘటనా స్థలానికి వచ్చి ప్రమాద వివరాలు తెలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఫోన్ చేసి ఘటనపై తెలుసుకున్నట్లు సమాచారం.

Content above bottom navigation