చైనాలో మరో కొత్త వైరస్.. ఒకరు మృతి

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ తొలిసారి చైనాలో వెలుగుచూసిన విషయంలో తెలిసిందే. హుబే ప్రావిన్సులను అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి.. దాదాపు 3,300 మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం కరోనా అక్కడ తగ్గుముఖం పట్టింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దాదాపు 184 దేశాలను ఈ మహమ్మారి వణికిస్తుంది. అన్ని దేశాలు కూడా ఈ మహమ్మారి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా చాలామంది దీని బారిన పడుతున్నారు. అయితే తాజాగా చైనాలో మరో కొత్తరకం వైరస్ ఆ దేశంలో బయటపడింది. చైనాలోని యునన్ ప్రావిన్సుల్లో ఓ వ్యక్తిలో హంటావైరస్ లక్షణాలతో సోమవారం మృతిచెందాడు. షాండాంగ్ ప్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటావైరస్‌తో మృతిచెందినట్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించారు. అతడు ప్రయాణించిన బస్సులోని మరో 32 మంది ప్రయాణికులకు కూడా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది.

Image result for చైనాలో మరో కొత్త వైరస్
కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

హంటావైరస్‌తో ఒకరు మృతిచెందడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇది మరో కరోనా వైరస్‌ మహమ్మారిగా విజృంభిస్తుందేమోనని భయపడిపోతున్నారు. అయితే, కరోనా వైరస్ మాదిరిగా హంటావైరస్ గాలిలో ఉండదు. హాంటావైరస్ వ్యాధికి ఎలుకలే కారణం. ఈ వైరస్‌కు ఎలుకలు ప్రధాన వాహకాలు. ‘ఇంటిలో, చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల ఉంటే హాంటావైరస్ వ్యాపించే ప్రమాదంగా ఉంది. ఈ వైరస్ బారిన పడితే సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా హెచ్‌పిఎస్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

హెచ్‌పీఎస్ కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది. చిలీ, అర్జెంటీనాలో అత్యంత అరుదైన కేసుల్లోనే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్టు తేలిందని, హంటావైరస్ సోకిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి సంక్రమించే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. ఈ వైరస్ సోకినవారిలో హెచ్‌పీఎస్ రోగుల మాదిరిగానే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, మైకం, విరేచనాలు, ఉదర సంబంధ లక్షణాలు ఉంటాయి. అలాగే, వైరస్ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఊపిరితిత్తులు కఫంతో నిండిపోయి, శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. హంటావైరస్‌ను ఆండీస్ వైరస్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఎలుకల ద్వారా సంక్రమిస్తుందని, దీని గురించి భయపడాల్సిన అవసరంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Content above bottom navigation