సూపర్ డ్రైవర్.. 40 రోజుల పసివాడి ప్రాణం కోసం 360 కి.మీ. కేవలం 4 గంటల్లోనే

1373

ఓ వైపు 40 రోజుల చిన్నారి జీవన్మరణ సమస్య. మరోవైపు ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలంటే దాదాపు 360కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రతి నిమిషం ఎంతో విలువైనది. విమానంలో తరలిద్దామా అంటే అందుకు డాక్టర్లు నో చెప్పారు. బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. మరి ఎలా… బిడ్డ ప్రాణాలు దక్కాలంటే ఆ ఆస్పత్రికే వెళ్లాలి.. మరి ఎలా వెళ్లారు. ఆ చంటిబిడ్డను అంత తక్కువ సమయంలో ఎలా చేర్చగలిగారు..? పూర్తీగా తెలుసుకుందాం.

భగవంతుడిపై భారం వేసిన తల్లిదండ్రులు

అది కర్నాటకలోని మంగళూరు. ఓ 40 రోజుల బిడ్డకు గుండె జబ్బు చేసింది. తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలను ఎలాగైనా రక్షించండి అంటూ డాక్టర్స్ ను వేడుకున్నారు. ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలంటే గుండెకు సంబంధించిన కవాటాలను మార్చాల్సి ఉంది. కానీ సమయం తక్కువగా ఉంది. ఆ చికిత్స కోసం బెంగుళూర్ కు ఆ చిన్నారిని తరలించాలి. పోనీ విమానంలో చిన్నారిని తరలిద్దామంటే, దానికి డాక్టర్లు నో చెప్పారు. విమానంలో పీడనంతో బిడ్డ ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఏం చేయాలి….400 కిలోమీటర్లు…ప్రతి క్షణం విలువైనదే. మించి పోతున్న సమయంతో పోటీ పడాల్సి వచ్చింది. ఇక చేసేదేమీ లేక భగవంతుడిపై భారం వేసి అంబులెన్స్‌ లోనే మంగళూరు నుంచి బెంగుళూర్ కు తరలించే ఏర్పాటు చేశారు. ఇక అంబులెన్స్‌ బయలు దేరింది. వేగం పుంజుకుంది. చిన్నారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలి. అంబులెన్స్‌ను సాధ్యమైనంత త్వరగా బెంగళూరులోని శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్క్యులార్ సైన్స్ అండ్ రీసెర్చ్‌కు తరలించాలి. ఇది డ్రైవర్ ముందున్న సవాల్. బిడ్డ అప్పటి వరకు ప్రాణాలతో ఉంచడం వైద్యుల ముందున్న సవాల్. అంబులెన్స్‌ లో ఉన్న బిడ్డ పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంబులెన్స్ ఫలానా మార్గంలో పయనిస్తుందని అంబులెన్స్‌ కు మార్గం సుగుమం చేయాలని అభ్యర్థించారు. ఇక మంగళవారం ఉదయం 12 గంటలకు అంబులెన్స్ మంగళూరు నుంచి బయలు దేరింది. ప్రతిక్షణం ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంబులెన్స్ ఆయా ప్రాంతాల్లోకి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు రహదారిని క్లియర్ చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

అంబులెన్స్ రయ్యిన దూసుకెళ్లింది. సాయంత్రం 4:30 గంటల సమయానికల్లా బెంగళూరులోని శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో వాస్క్యులార్ సైన్స్ అండ్ రీసెర్చ్‌కు చేరింది. 360 కిలోమీటర్లను కేవలం నాలుగున్నర గంటల్లో కవర్ చేసింది. వెంటనే చిన్నారిని అడ్మిట్ చేశారు. సుదీర్ఘ ప్రయాణం వల్ల చిన్నారి పరిస్థితి కాస్త సీరియస్‌ గానే ఉంది. చిన్నారికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్స చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళూరు నుంచి అంబులెన్స్ మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో స్టార్ట్ అయినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అంబులెన్స్‌కు మార్గం సుగుమం చేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిడ్డ పరిస్థితి గంట గంటకు విషమిస్తుండటంతో చిన్నారి ప్రాణాల కోసం ప్రతి ఒక్కరూ భగవంతుడికి ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం బిడ్డ పరిస్థితి విషమంగా ఉంది. బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఎంతో కష్టపడ్డ సిబ్బంది, మార్గం సుగుమం చేసిన ప్రజల కష్టం వృథా పోదనే అనుకుందాం. చిన్నారి తిరిగి క్షేమంగా రావాలని ఆశిద్దాం. ఇక ప్రాణాలకు తెగించి అంబులెన్సు నడిపిన డ్రైవర్ హనీఫ్‌ ను బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు, హాస్పిటల్ సిబ్బంది పూలమాలతో సత్కరించారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆ అంబులెన్స్ డ్రైవర్ ను అభినందిద్దాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation