ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతి రావు.శనివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోగా, ఆదివారం వెలుగు చూసింది. కూతురుపై ప్రేమతో చేతికి రక్తపు మరకలు అంటించుకున్న ఆయన బలవన్మరణం చర్చనీయాంశమైంది.కోర్టు పని ఉందంటూ హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు భార్య గిరిజతో చెప్పిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు. అదే ఆయన భార్యతో నేరుగా మాట్లాడిన చివరి మాటలు, అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇక తన దగ్గరకు రాదు అని తెలుసుకున్నారు మారుతీరావు, భర్తని హత్య చేసిన తండ్రి దగ్గరకు తన బిడ్డలో వెళ్లడానికి అమృత కూడా సిద్దం కాలేదు, ప్రణయ్ కుటుంబంతోనే ఆమె ఉంది.

శనివారం హైదరాబాద్‌కు చేరుకున్న మారుతిరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవనంలో 306 నెంబర్‌గల రూంను అద్దెకు తీసుకున్నాడు.. రూం తీసుకున్న విషయాన్ని భార్యకు ఫోన్‌చేసి చివరిసారిగా చెప్పాడు.. తాను కోర్టు పని మీద వచ్చాను అని రెండు రోజుల్లో వస్తాను జాగ్రత్త అని చెప్పారట.. ఇవే ఆయన చివరగా ఆమెతో చెప్పిన మాటలు.కారు డ్రైవర్‌తో గారెలు తెప్పించుకున్న మారుతిరావు గది తలుపులు బిగించుకున్నాడు. ఆ తరువాత భార్య గిరిజ శనివారం సాయంత్రం ఫోన్ చేయగా, ఎంతకూ ఎత్తకపోవడంతో, కారు డ్రైవర్‌కు ఫోన్ చేసింది. అతడు రూం దగ్గరకు వెళ్లి పిలిచినా పలకపోవడంతో అనుమానించిన భార్య గిరిజ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఖైరతాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు ఆర్యవైశ్యభవనం దగ్గరకు చేరుకొని గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో తలుపులు పగులగొట్టి బెడ్రూంను పరిశీలించగా, మారుతీరావు విగతజీవిగా పడివున్నాడు… బెడ్‌పక్కన పడివున్న గారెల్లో విషం (పురుగుల మందు) కలిపి ఉన్నట్లుగా గుర్తించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించుకున్న పోలీసులు మారుతిరావు భార్య గిరిజకు ఫోన్‌చేసి సమాచారమిచ్చారు.
ఈ క్రింది వీడియో చూడండి
దీంతో ఆమె తన మరిది శ్రవణ్‌కుమార్‌ను వెంటబెట్టుకొని ఆదివారం ఉదయం మిర్యాలగూడ నుంచి కారులో సంఘటన స్థలికి చేరారు. మారుతిరావుకు సంబంధించిన సూట్‌కేసును సీజ్చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు మినహ మిగిలిన వారిపై కేసు విచారణ సాగనుంది.
ఈ క్రింది వీడియో చూడండి