మారుతీరావు కోట్ల ఆస్తి కోసం బంధువులు భారీ ప్లాన్

58

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటం..బంధువర్గాలల్లో పరువు పోవటంతో మారుతీరావు కిరాయి మనుషులతో కూతురు భర్త ప్రణయ్ ను హత్య చేయించాడనే ఆరోపణలల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో కేసులు, వాయిదాలు, జైలుజీవితం, తరువాత బయటకు వచ్చిన నాటి నుంచి సుపారీగా ఇవ్వాల్సిన డబ్బు గురించి కిరాయి వ్యక్తులు డబ్బుల కోసం వేధింపుల వల్ల గత రెండు సంవత్సరాల నుంచి మారుతీరావు మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడితోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా మారుతీరావు బ్రతికి ఉండగా కేసుల నుంచి తప్పించుకోవటాని కావచ్చు..లేదా కూతురిపై మమకారం పోగొట్టుకోలేక కావచ్చు కారణం ఏదైనా అమృతను తిరిగి ఇంటికి తీసుకురావటానికి శతవిధాల యత్నించాడు. మధ్యవర్తులతో కబురు పంపించాడు. అలా రెండు మూడు సార్లు ప్రయత్నించగా, అమృత మరోసారి తండ్రిపై కేసులు పెట్టటంతో మారుతీరావును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై వచ్చిన మారుతీరావుకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ క్రమంలో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు.

నిన్న ఆత్మహత్య చేసుకున్న మారుతీరావుకు ఈరోజు మిర్యాలగూడ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. నీవల్లే మారుతీరావు చనిపోయాడు..నువ్వు వస్తే ఆయన ఆత్మశాంతించదు వెళ్లిపో అంటూ బంధువులు అమృతపై ఆరోపణలు చేశారు. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.. దీంతో శ్మశానం దగ్గర ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. తన తండ్రిని కడసారి చూడకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బంధువులు ఇలా ప్రవర్తించడం వెనుక ఒక పెద్ద గూడుపుఠానే దాగివుందని అందరు అనుకుంటున్నారు. అమృత తిరిగి పుట్టింటికి దగ్గరైతే మారుతీరావు ఆస్తులు తమకు దక్కవనే కారణంతో అతని బంధువులు అమృతను అడ్డుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి కూడా ఓ కారణముంది. ఆత్మహత్య సమయంలో మారుతీరావు సూసైడ్ నోట్ లో ‘‘అమృతను తిరిగి వచ్చేయమనీ..అమ్మ దగ్గరకు వచ్చేయ్ అమృతా అని రాసిన నోట్ ను పోలీసులు గుర్తించారు. దీంతో అమృత తండ్రి మారుతీరావు మరణంతో వారంతా ఒకటి అయిపోతారనీ, ఆస్తులు అమృతకు ఇవ్వాల్సి వస్తుందనే అమృతను రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Image result for amrutha pranay

ఇక శ్మశానవాటికకు వెళ్లొచ్చిన తర్వాత అమృత ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ ప్రెస్ మీట్ లో ఆమె పలు విషయాల మీద మాట్లాడారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఓ మనిషిని చంపగలిగినంతవాడు ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. మారుతీరావు ఆత్మహత్యకు కారణాలు నాకు తెలియదు. బహుశా ఒత్తిడి వల్లే నాన్న చనిపోయి ఉంటాడని అనుకోను. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత నాన్న.. నన్ను ఇంటికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. అక్కడకు వెళ్లడం నాకిష్టం లేదు. ఇక నా గురించి అయితే మారుతీరావు ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్లు. చనిపోవడానికి వేరే కారణాలు ఉండి ఉండవచ్చు.

Image result for amrutha pranay

ఇక ఆస్తుల గురించి నాకు అవసరం లేదు. వాళ్ల ఆస్తుల మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. మారుతీరావు, బాబాయ్‌ శ్రవణ్‌ మధ్య గొడవలు ఉన్నాయి. నాన్నను బాబాయ్‌ రెండుసార్లు కొట్టినట్లు తెలిసింది. ఆస్తి విషయంలో మా అమ్మకు బాబాయ్‌ నుంచి ప్రాణహాని ఉండచ్చొని నేను భావిస్తున్నాను. అంతేకాదు, తల్లి తన దగ్గరికి వస్తానంటే తాను చూసుకుంటానని చెప్పింది. తండ్రి మరణించినపుడు కంటతడి పెట్టలేదు ఎందుకని అడిగితె, ప్రాణంగా ప్రేమించిన భర్తపోయినపుడు కంటతడిపెట్టకుండా ధైర్యంగా నిలబడ్డాను, ఇప్పుడు ఎలా కంటతడి పెడతాను అని మీడియాను ఎదురు ప్రశ్నించింది అమృత.

Content above bottom navigation