అమృత మారుతీరావుకి ఎంత నరకం చూపించిందో తెలుసా… అసలు నిజాలు చెప్పిన మారుతీరావు స్నేహితులు

125

మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది. శనివారం అర్థరాత్రి ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో అయన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు. నిన్న ఉదయం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మారుతీరావు మృతిపై రకరకాల వార్తలు వచ్చినా కూడా అయన విషం కలిపినా గారెలు తినడం వల్లనే చనిపోయాడని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వచ్చింది. తానే కావాలని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు ఆయన కూతురు అమృతనే కారణమని మారుతీరావు స్నేహితులు అంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

మారుతీ రావు ఆత్మహత్యపై ఆయన స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమయ్యాయట. కోటీశ్వరుడైన ఆయన ఓ దశలో రూ.50 వేలు కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారట. ఈ విషయాన్నీ ఆయన స్నేహితులు చెప్పారు. అలాగే మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణయ్ హత్య కేసుతో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలనేది బంధువు మిత్రులు చెబుతున్న మాట. మిర్యాలగూడ సమీపంలోని ఓ వ్యాపార సముదాయాన్ని మారుతీరావు విక్రయించారు. కానీ అందులో తన సోదరుడికి సైతం వాటా ఉంది. దీంతో డబ్బు ఆయన తీసుకున్నారని తెలుస్తోంది. మరో వైపు బ్యాంకు నుంచి మారుతీరావుకు నోటీసులు అందాయట. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని తెలుస్తోంది. కూతురి ప్రేమ వివాహాన్ని మారుతీరావు తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయిన ఆయన ఆవేశంలో అల్లుణ్ని హత్య చేయించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఆయన్ను కుంగదీశాయి. అని స్నేహితులు చెప్తున్నారు.

తన కూతురు ఎప్పటికైనా తన దగ్గరకు రాకుండా ఉంటుందా అని మారుతీరావు స్నేహితుల దగ్గర అనే వాడంట. కూతురు అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రతిక్షణం కూడా కూతురి గురించే ఆలోచించేవాడు. నా కూతురిని అలా పెంచాను, ఇలా పెంచాను, కానీ ఇప్పుడు చాలా బీద పరిస్థితి అనుభవిస్తుంది. అది తట్టుకోవడం నా వల్ల అవ్వడం లేదు. అందుకే తన దగ్గరకు వచ్చేయమని కబురు పంపించాను. అయినా నా ప్రేమ అర్తం చేసుకోకుండా నా మీద కేసులు పెట్టిందని స్నేహితులతో చెప్పి బాధపడేవాడంట. ఒక్క మాటలో చెప్పాలంటే మారుతీరావు ఆత్మహత్యకు అమృతనే కారణం. ఆయన చనిపోయేవరకు కూడా మానసిక క్షోభ అనుభవించేలా చేసింది అమృత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు అమృత నరకం చూపించింది. ఇది ముమ్మాటికీ అమృత తప్పే అని అంటున్నారు మారుతీరావు స్నేహితులు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation