మారుతీరావు జీవితంలో అతి పెద్ద తప్పు చేసి మళ్లీ తనకు తానుగా శిక్ష వేసుకున్నాడు
ఓ పక్క కులాంతర వివాహం ఓర్చుకోలుని ఈ పెద్ద మనిషి
పరువు ప్రతిష్ట అనే ఊబిలో కూరుకుపోయాడు
సొంత అల్లుడ్నే కడతేర్చి – చివరికి ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు.
కూతురే తనను అసహ్యించుకోవడం మారుతీరావు తట్టుకోలేకపోయాడు.
ఒకవైపు కూతురు రావడం లేదనే బాధ, మరోపక్క వెంటాడుతున్న కేసులు..
ఇలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న మారుతీరావు చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఆయన తిన్న గారెలలో విషం కలవడం వల్లనే ఆయన చనిపోయాడని ఫోరెన్సిక్ డాక్టర్స్ చెప్పారు. అయితే అందులో ఆయనే విషం కలుపుకున్నాడా, లేక ఎవరైనా కలిపి ఆయనకిచ్చారా అనే అనుమానాలు పోలీసులకు వస్తున్నాయి. అక్కడ రూమ్స్ బయట ఉన్న సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.ఆయన కారు డ్రైవర్ ని పోలీసులు విచారించారు.

ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మిర్యాలగూడ నుంచి తన కారులో డ్రైవర్ రాజేష్ తో కలిసి మారుతీరావు బయలు దేరారు. అయితే మార్గమధ్యలో ఓ ఎరువులు పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపమంటే తాను అపానని, ఒక దుకాణం ముందు కారు ఆపగానే ఆ దుకాణంలోకి వెళ్లిన ఆయన కొద్దిసేపటి తర్వాత వచ్చి వచ్చారని, ఆయన చేతిలో పురుగుల మందు ఉండటం చూసి, ఇది ఎందుకు సర్ అని అడిగితే, ఇంటి దగ్గర చెట్లకు కొట్టడానికి అని చెప్పాడని, ఈ మందు మిర్యాలగూడలో దొరకడం లేదు, అందుకే ఇక్కడ కొన్నట్టు చెప్పాడని డ్రైవర్ చెప్పాడు. ఆ తరువాత నేరుగా కారులో ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ కు చేరుకున్నామని చెప్పారు. ఆ తరువాత శనివారం రాత్రి తనతో గారెలు తెప్పించుకున్నాడని డ్రైవర్ చెప్పాడు. ఆదివారం నాడు ఉదయం లాయర్ దగ్గరకు వెళ్లాలని, నువ్వు వెళ్లి కారులో పడుకోమని చెప్పాడని డ్రైవర్ చెప్పాడు. ఇక మురుసటి ఉదయం సర్ ను లేపుదామని వెళ్తే డోర్ క్లోజ్ ఉంది. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచి తలుపు పగలగొట్టాం. లోపలికి వెళ్లి చూస్తే, సర్ చనిపోయి ఉన్నాడని పోలీసుల వద్ద డ్రైవర్ చెప్పారు.
ఇక నిన్నటి నుంచి ఆయన కారు డ్రైవర్ పేరిట కోట్ల రూపాయల ఆస్తి రాశారు అని వార్తలు వచ్చాయి.. అందులో వాస్తవం లేదు అంటున్నారు, డ్రైవర్లు అలాగే ఇంటి దగ్గర ఆస్పత్రి షాపింగ్ మాల్స్ లో పని చేసే గుమస్తాలు వీరు అందరూ ఎంతో కాలంగా పని చేసే సీనియర్లు, వీరికి ఆర్దిక సాయం చేసేవారు.. ఒకవేళ వీరు ఇళ్లుకట్టుకుంటే వారికి నగదు ఇచ్చేవారు.. అంతేకాని ఆస్తులు ఏమీ రాయలేదు అని విచారణలో తెలుస్తోందట.. ఇలా కోట్ల రూపాయల ఆస్తి రాశాడు అనేది మాత్రం పూర్తి అవాస్తవం అంటున్నారు.