మారుతీరావు కేసులో ట్విస్ట్… గారెలు తిన్న మారుతీరావు ఎలా చనిపోయాడు.? బాటిల్ ఏమైంది?

117

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన ఎంత కలవరం స్పృష్టించిందో మనకు తెలుసు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని, అందరిలో పరువు పోయిందని అల్లుడు అయినా ప్రణయ్ కు సుపారీ ఇచ్చి దారుణంగా చంపించాడు మారుతీరావు. ఈ కేసులో A1 మారుతీరావు, A2సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 మహ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్, A7 శివ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరు బెయిల్ మీద బయట ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత కూతురికి రాయబారం కూడా పంపాడు. తన దగ్గరకు వస్తే ఆస్తి మొత్తం తన పేరు మీద రాస్తానని చెప్పాడు. కానీ దానికి అమృత ఒప్పుకోలేదు. కూతురు దూరం కావడం, కేసులు మీద ఉండడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది.

ఈ తరుణంలో శనివారం సాయంత్రం కమారుతీ రావు హైద్రాబాద్‌ ఆర్యవైశ్య భవనానికి వచ్చారు. రూమ్ నెంబర్ 306 ను అద్దెకు తీసుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో డ్రైవర్‌ తో కలిసి మారుతీరావు బయటకు వెళ్లి వచ్చాడు. ఓ లాయర్ ని కలిసే పని మీద ఆయన హైదరాబాద్ కి వచ్చారంట. ఇక తన రూమ్ కు వెళ్లిన తర్వాత మారుతీరావు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం నాడు ఉదయం 8 గంటలకే తనను నిద్ర లేపాలని డ్రైవర్ కు చెప్పారు. ఆదివారం ఉదయం డ్రైవర్ రూమ్ దగ్గరకి వచ్చి తలుపు తట్టినా మారుతీరావు తలుపులు తీయలేదు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందితో కలిసి డ్రైవర్ తలుపులు బద్దలు కొట్టాడు. అప్పటికే అతను మరణించి ఉన్నాడు.

Image result for మారుతీరావు కేసులో ట్విస్ట్

ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నా, అందుకు సంబంధించిన ఆధారం దొరక్కపోవటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. ఆర్యవైశ్య భవన్ లోని రూంలోకి వెళ్లిన తర్వాత గారెలు తెప్పించుకు తిన్న మారుతిరావు, కాసేపటికే వాంతులు చేసుకున్నట్లుగా బెడ్ పక్కన ఉన్న రక్తపు వాంతుల్ని చూస్తే అర్థమవుతుంది. గారెలు తిన్నంత మాత్రాన ఎవరూ చనిపోరు. అలా అని గారెల్లో విషం కలుపుకు తిన్నారా? అంటే.. దానికి సంబంధించిన బాటిల్ కానీ ప్యాకెట్ కానీ దొరకలేదు. ఆ బాటిల్ ఎక్కడ ఉంది అన్నది మరో ప్రశ్న తలెత్తుతుంది. విషం తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటారన్న దానికి తగ్గ ఆధారం లభించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సోదరుడు శ్రవణ్‌తో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను శ్రవణ్ ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల మారుతీరావు వీలునామాలో సోదరుడి పేరును తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ప్రస్తుతం వీలునామాపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే మారుతిరావు బస చేసిన హోటల్ పరిసరాలకు చెందిన సీసీ కెమేరాల ఫుటేజ్ ను విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఫోరెన్సిక్ సిబ్బంది.. క్లూస్ టీం పలు ఆధారాల్ని సేకరించింది. ఉస్మానియాలో మారుతిరావు డెడ్ బాడీకి పోస్టుమార్టం చేశారు. ఈ రిపోర్టులో ఏముంది అనే విషయం కీలకం కానుంది.

Content above bottom navigation