తండ్రి మారుతీరావు చివరి కోరిక తీర్చేసిన అమృత..! చివరకు తల్లి చెంతకు..?

127

నల్గొండ జిల్లా మిరియాల గూడాలో సంచలనం కలిగించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో గదిని అద్దెకు తీసుకున్న మారుతీరావు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి పాయిజన్‌ బాటిల్‌, సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మారుతీరావు రాసినట్లుగా భావిస్తున్న ఆ సూసైడ్‌ నోట్‌లో ‘‘ గిరిజ క్షమించు.. తల్లి అమృత అమ్మ దగ్గరికి వెళ్లిపో’ అని రాసి ఉంది.తాను ఎలాగూ చనిపోతున్నాను కాబట్టి.. తన భార్య, కూతురు కలసి ఉండాలన్నది మారుతీరావు చివరికోరిక కావచ్చు. అయితే మారుతీ రావు అంత్యక్రియల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన అమృత తాను తల్లి వద్దకు వెళ్లనని.. తల్లి తన వద్దకు వచ్చి ఉంటానంటే.. ఆమె బాగోగులు చూసుకుంటానని చెప్పింది. అయితే దీనిపై తల్లి స్పందన ఏంటన్నది తెలియలేదు.

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

ఈ క్రింది వీడియో చూడండి

మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అనూహ్యంగా మరో ఘటన జరిగింది. ప్రణయ్‌ భార్య అమృత శనివారం సాయంత్రం తన తల్లి గిరిజను కలిశారు.తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి తల్లిని పరామర్శించింది. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు భావిస్తున్నారు. గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే తల్లీకూతుళ్లు ఏం మాట్లాడుకున్నారన్నది ఇంకా తెలియరాలేదు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation