పాపం మారుతీరావు.. కోట్ల ఆస్తి సంపాదించినా చివరికి రూ.50 వేలు కోసం

61

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. మారుతీ రావు మృతి మిస్టరీగానే మిగిలింది. వ్యాపారవేత్త మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. స్మశాన వాటికకు పెద్దఎత్తున మారుతీరావు కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకున్నారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ఇదిలా ఉంటే అమృత పోలీసుల భద్రత మధ్య తండ్రి అంత్యక్రియలకు వెళ్లారు. తండ్రిని చివరి చూపు చూసేందుకు శ్మశానం దగ్గరకు వెళ్లగా, ఆమెను బంధవులు అడ్డుకున్నారు. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.. దీంతో శ్మశానం దగ్గర ఉద్రిక్త పరిస్థితుల ఏర్పడ్డాయి. తన తండ్రిని కడసారి చూడకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూతురి ప్రేమ, పెళ్లి వ్యవహారం నచ్చక అల్లుణ్ని హత్య చేయించడం ఆయన చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఆయన చివరకు తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. ఫలితంగా తన కూతురికే కాదు తన భార్యకు కూడా భర్త దూరమయ్యాడు. ప్రేమించి పెళ్లాడిన భర్త హత్యకు గురి కావడంతో అమృత అప్పుడెంత భాధను అనుభవించిందో, ఇప్పుడు మారుతీ రావు భార్య గిరిజ కూడా అంతకంటే ఎక్కువ బాధను అనుభవించాల్సిన దుస్థితి వచ్చింది.

ఈ క్రింది వీడియో చూడండి

మారుతీ రావు ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమయ్యాయట. కోటీశ్వరుడైన ఆయన ఓ దశలో రూ.50 వేలు కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారట. మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రణయ్ హత్య కేసుతో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలనేది బంధువు మిత్రులు చెబుతున్న మాట. మిర్యాలగూడ సమీపంలోని ఓ వ్యాపార సముదాయాన్ని మారుతీరావు విక్రయించారు. కానీ అందులో తన సోదరుడికి సైతం వాటా ఉంది. దీంతో డబ్బు ఆయన తీసుకున్నారని తెలుస్తోంది. మరో వైపు బ్యాంకు నుంచి మారుతీరావుకు నోటీసులు అందాయట. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని తెలుస్తోంది. కూతురి ప్రేమ వివాహాన్ని మారుతీరావు తట్టుకోలేకపోయాడు. మానసికంగా కుంగిపోయిన ఆయన ఆవేశంలో అల్లుణ్ని హత్య చేయించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఆయన్ను కుంగదీశాయి.

Image result for పాపం మారుతీరావు.. రూ.50 వేలు దొరక్క తిప్పలు..

ప్రణయ్‌ను హత్య చేయించడానికి మారుతీ రావు కోటి రూపాయలకు సుపారీ ఇవ్వడానికి బిహార్ ముఠాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులైన సుభాష్ శర్మ, అబ్దుల్ బారీ, కరీం బెయిల్ మీద బయటకు రాగా, అస్ఘర్ అలీ అనే నిందితుడు జైల్లోనే ఉన్నాడు. వీరికి ఉగ్రమూలాలు ఉన్నాయి. జైలు నుంచి బయటకొచ్చిన నిందితులు మారుతీరావును డబ్బు కోసం ఒత్తిడి చేశారని సమాచారం. ఎంత డబ్బు ఇచ్చినా.. ఇంకా ఇంకా ఇవ్వాలని ఒత్తిడి చేశారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ఆస్తులను విక్రయిద్దామని భావించినా, ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇంకోవైపు ఆస్తి పంచివ్వాలని సోదరుడు తీసుకొచ్చిన ఒత్తిడి కూడా ఆయనపై ప్రభావం చూపింది.

ఈ క్రింది వీడియో చూడండి

కేసులతో మానసిక ఒత్తిడికి గురైన మారుతీరావు హైదరాబాద్‌ లో ఓ డాక్టర్ వద్ద చికిత్స కూడా పొందారని తెలుస్తోంది. ప్రణయ్ హత్య కేసు విచారణ కోసం ఆయన తరఫున వాదించేందుకు మిర్యాలగూడకు చెందిన లాయర్లెవరూ ముందుకు రాలేదు. దీంతో ఆయన హైదరాబాద్‌ లో లాయర్‌ ను మాట్లాడుకునేందుకు తిరుగుతున్నారు. మరోవైపు ఆస్తి రాసిస్తానని చెప్పినా కూతురు వెనక్కి తగ్గకపోవడం మారుతీరావును కలచి వేసింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నా, ఆయన చేతిలో డబ్బులు లేని పరిస్థితి. రూ.50 వేల కోసం ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారట. ఈ పరిస్థితులన్నీ మారుతీరావు బలవన్మరణానికి దారి తీశాయి.

Content above bottom navigation