మారుతీరావు కార్ డ్రైవర్ బయటపెట్టిన సంచలన నిజాలు

59

తిరునగరి మారుతీరావు… ఇప్పుడు రెండు తెలుగు రాష్టాల్లో అందరి నోట్లో నానుతున్న పేరు. సంవత్సనర కిందట తన కూతురు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న పగతో అల్లుడ్ని హత్య చేయించిన వ్యక్తి. ఆ ఘటన తర్వాత కూతురు కోసం పరితపించిన వ్యక్తి. ఏ కూతురి కోసం అయితే తానూ ఇంతలా చేశాడో, ఆ కూతురే తనను అసహ్యించుకోవడం మారుతీరావు తట్టుకోలేకపోయాడు. ఒకవైపు కూతురు రావడం లేదనే బాధ, మరోపక్క వెంటాడుతున్న కేసులు.. ఇలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న మారుతీరావు చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో ఆయన ఇష్యు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులకు ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి.

ఆయన తిన్న గారెలలో విషం కలవడం వల్లనే ఆయన చనిపోయాడని ఫోరెన్సిక్ డాక్టర్స్ చెప్పారు. అయితే అందులో ఆయనే విషం కలుపుకున్నాడా లేక ఎవరైనా కలిపి ఆయనకిచ్చారా అనే అనుమానాలు పోలీసులకు వస్తున్నాయి. ఇందులో భాగంగా మారుతీరావు వెంటనే ఉన్న ఆయన కారు డ్రైవర్ ని విచారించారు. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మిర్యాలగూడ నుంచి తన కారులో డ్రైవర్ రాజేష్ తో కలిసి మారుతీరావు బయలు దేరారు. అయితే మార్గమధ్యలో ఓ ఎరువులు పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపమంటే తాను అపానని, ఒక దుకాణం ముందు కారు ఆపగానే ఆ దుకాణంలోకి వెళ్లిన ఆయన కొద్దిసేపటి తర్వాత వచ్చి వచ్చారని, ఆయన చేతిలో పురుగుల మందు ఉండటం చూసి, ఇది ఎందుకు సర్ అని అడిగితే, ఇంటి దగ్గర చెట్లకు కొట్టడానికి అని చెప్పాడని, ఈ మందు మిర్యాలగూడలో దొరకడం లేదు, అందుకే ఇక్కడ కొన్నట్టు చెప్పాడని డ్రైవర్ చెప్పాడు. ఆ తరువాత నేరుగా కారులో ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ కు చేరుకున్నామని చెప్పారు. ఆ తరువాత శనివారం రాత్రి తనతో గారెలు తెప్పించుకున్నాడని డ్రైవర్ చెప్పాడు. ఆదివారం నాడు ఉదయం లాయర్ దగ్గరకు వెళ్లాలని, నువ్వు వెళ్లి కారులో పడుకోమని చెప్పాడని డ్రైవర్ చెప్పాడు. ఇక మురుసటి ఉదయం సర్ ను లేపుదామని వెళ్తే డోర్ క్లోజ్ ఉంది. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచి తలుపు పగలగొట్టాం. లోపలికి వెళ్లి చూస్తే, సర్ చనిపోయి ఉన్నాడని పోలీసుల వద్ద డ్రైవర్ చెప్పారు.

Image result for మారుతీరావు కార్ డ్రైవర్

ఇక డ్రైవర్ చెప్పిన దానిని బట్టి చూస్తే మారుతీరావు, ఆ దుకాణంలో కొన్న విషాన్ని కలుపుకుని తిని ఉంటారని అంచనా వేస్తున్నారు. అతను చనిపోవాలని ముందు నుంచే డిసైడ్ అయ్యి, హైదరాబాద్ వచ్చే మార్గంలో పురుగుల మందు కొని తన వెంట తెచ్చుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అలాగే మారుతీరావు కాల్ డిటైల్స్ ను పరిశీలిస్తున్న పోలీసులు శనివారం రాత్రి 8.22 గంటలకు ఆయన ఆఖరి ఫోన్ కాల్ చేశారని మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకట సుబ్బారెడ్డితో మాట్లాడినట్లు పోలిసుల విచారణలో తేలింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆర్య వైశ్య భవన్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్ నీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద ఫుటేజ్ లభించలేదు.

Content above bottom navigation