వీడని మారుతీ రావు మృతి మిస్టరీ : హోటల్ లో ఆ రెండు గంటలు ఏం జరిగింది?

62

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. మారుతీ రావు మృతి మిస్టరీగానే మిగిలింది. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సోదరుడు శ్రవణ్‌తో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను శ్రవణ్ ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల మారుతీరావు వీలునామాలో సోదరుడి పేరును తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ప్రస్తుతం వీలునామాపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

అలాగే మారుతీరావుది హత్యనా, ఆత్మహత్యనా, సహజ మరణమా అనేది తేలడం లేదు. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని వారు విచారణ జరుపుతున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లేమీ గదిలో లభించలేదని తెలుస్తోంది. ఆయన బస చేసిన ఆ గదలో విషం గానీ పురుగుల మందు డబ్బా కానీ పోలీసులకు లభించలేదు. దాంతో శనివారం సాయంత్రం 6.50 నుంచి 9 గంటల వరకు అంటే రెండు గంటల పాటు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మారుతీరావు శనివారం ఆరు గంటల యాభై నిమిషాలకు ఆర్యవైశ్య యాభై నిమిషాలకు గదికి వచ్చాడు. గదిలోకి వచ్చిన తర్వాత కారు డ్రైవర్ ను పంపించి అల్పాహారం కోసం గారెలు తెప్పించుకున్నాడు. ఆ తర్వాత డ్రైవర్ ను కిందకు పంపించి గడియ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియదు. అయితే గదిలో, వాష్ రూంలో, బాత్రూంలో మారుతీరావు వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. ఒకవేళ హోటల్ సిబ్బంది కారు డ్రైవర్ వచ్చేంతవరకు ఆయన రూమ్ లోకి వెళ్తే ఆయన తాగిన పురుగుల మందు బాటిల్, విషం బాటిల్ ఎక్కడికి వెళ్లినట్టు అని తెలుసుకునే దిశగా విచారణ జరుపుతున్నారు.

సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ కనిపించింది. గిరిజ క్షమించు, అమృత అమ్మ దగ్గరకు వెళ్ళు అని రాసి ఉంది. అయితే, అందులోని రాత మారుతీరావుదేనా, కాదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత మారుతీ రావు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లారు, కలిసిన వాళ్ళతో ఏం మాట్లాడారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానితో పాటు ఆయన కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన చివరి కాల్ ఎవరికీ చేశారు. ఏం మాట్లాడారు. హైదరాబాద్ వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారు.. ఇలా రకరకాల విషయాల మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యనున్నారు. చూడాలి మరి చివరికి పోలీసులు ఏం తెలుస్తారో..

Content above bottom navigation