మారుతీరావు పోస్టు మార్టం రిపోర్ట్ లో ఏం వచ్చిందో చూసి తలలు పట్టుకున్న పోలీసులు

131

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. మారుతీ రావు మృతి మిస్టరీగానే మిగిలింది. వ్యాపారవేత్త మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. స్మశాన వాటికకు పెద్దఎత్తున మారుతీరావు కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకున్నారు. తమ్ముడు శ్రవణ్ అన్న చితికి నిప్పంటించారు. ఇక అంత్యక్రియలు కంప్లీట్ అయ్యాకా, అమృత, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ విడివిడిగా ప్రెస్ మీట్ లు పెట్టి ఆరోపణలు చేశారు.

అమృత శ్రవణ్ మీద, మారుతీరావు ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కూడా అమృత మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి ప్రెస్ మీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక మారుతీరావు ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మారుతీరావు ఆత్మహత్య ఉదంతంలో కొత్త విషయం వెలుగుచూసింది. ఆయన ఆత్మహత్య పోస్టుమార్టం నివేదిక బయటపడింది.. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని, విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే మారుతీరావు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

Image result for మారుతీరావు పోస్టు మార్టం రిపోర్ట్

మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించి ప్రిలిమినరీ పోస్ట్ మార్టం నివేదికను వైద్య అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఆయన మరణం గురించిన కీలక విషయాలను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఆ నివేదికలో ఉన్న వివరాల ప్రకారం.. మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని స్పష్టమైంది. ఆయన శరీరం నీలం రంగులోకి మారిన సంగతి తెలిసిందే. అయితే, ఇందుకు విష పదార్థమే కారణమని తేల్చారు. దీని ద్వారానే ఆయన మరణించారని నివేదికలో పేర్కొన్నారు. విషం స్వీకరించిన అనంతరం ఆయన శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయిందని, తద్వారా బ్రెయిన్ డెడ్, కార్డియాక్ అరెస్ట్ వంటివి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. మారుతీరావు నుంచి విస్రా శాంపిల్‌ను ఫోరెన్సిక్ వైద్యులు సేకరించారు.

ఈ విస్రా శాంపిల్‌ను పరిశీలించడం ద్వారా మారుతీరావు ఏ రకం విషం తీసుకున్నాడో తెలుస్తుందని వైద్యులు తెలిపారు. మరోవైపు, మారుతీరావు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన లాయర్ వెంకట సుబ్బారెడ్డి వెల్లడించారు. మారుతీరావు తనకు ఏడేళ్ల నుంచి తెలుసని చెప్పారు. కుమార్తె అమృత అంటే మారుతీరావుకు ఎంత ఇష్టమో ఉదాహరణలతో సహా వివరించారు. ఎప్పటికైనా తన కూతురు తన వద్దకు వస్తుందని మారుతీరావు భావించాడు. కానీ కన్న కూతురే తన మీద కేసు పెట్టడం మారుతీరావు తట్టుకోలేకపోయాడు. ఇక కోర్ట్ కూడా తనకు శిక్ష వేస్తుందని భావించి ఉంటాడు. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని లాయర్ వివరించారు.

Content above bottom navigation