మారుతీరావు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ సంచలన నిజాలు

153

తెలంగాణ రాష్టంలో 2018 సెప్టెంబర్ 14 న జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఎంత కలకాలం స్పృష్టించిందో మనకు తెలుసు. వేరే కులం వాడిని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని, కక్ష్య గట్టి కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే స్పృష్టించింది. ఆ తర్వాత పోలీసులు మారుతీరావు అండ్ టీమ్ ను పట్టుకుని జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యి బయటకు వచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు మరొక ట్విస్ట్ ఏర్పడింది. కేసులో ప్రధాన నిందితుడు అయినా మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ఇక ఆత్మహత్య చేసుకున్న మారుతీరావుకు కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం నిర్వహించారు ఉస్మానియా డాక్టర్స్. ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. మారుతీరావుది ఆత్మహత్యేనని ఉస్మానియా వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. పోస్టుమార్టం నివేదిక హైదరాబాద్ పోలీసులకు అందించింది. ఆయన పురుగుల మందు తాగడం వల్లనే చనిపోయినట్లుగా ఆధారాలు లభించాయని నివేదికలో డాక్టర్లు పేర్కొన్నారు. ఆయన కడుపులో పురుగుల మందు ఆనవాలు క్లియర్ గా కనిపించాయి. అంతేకాదు ఆయన చివరగా చికెన్ తో భోజనం చేసి, కాఫీ తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయన సూసైడ్ చేసుకున్న రూమ్ లో కూడా ఆయన వాంతింగ్ చేసుకున్నారు. అందులో కూడా ఆయన తీసుకున్న ఫుడ్ బయటకు వచ్చింది. పోస్టుమార్టం తర్వాత కొన్ని శాంపిల్స్‌ ని సేకరించి FSLకి పంపించారు. మారుతీరావు మృతేదేహానికి నలుగురు డాక్టర్ల బృందం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించింది. దాదాపు 2 గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. మృతదేహం పాడవకుండా ఉండేందుకు ఎంబామింగ్ చేసి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉస్మానియా ఆస్పత్రి నుంచి మారుతీరావు పార్థివదేహాన్ని నేరుగా మిర్యాలగూడ తీసుకెళ్లారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి.

Image result for మారుతీరావు

ఇక మారుతీరావు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల ఒత్తిడితో చనిపోయారని ఆయన భార్య ఆరోపించారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని సోదరుడు భావిస్తున్నారు. ఆత్మహత్య గురించి తెలుసుకున్న మారుతీరావు భార్య ఆమె తరపు బంధువులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి భార్య గిరిజ కుప్పకూలిపోయారు. చేతులతో గుండెలు బాదుకుంటూ ఆమె రోదించిన తీరు అందర్నీ కలచి వేసింది. భర్త శవం వద్ద ఆమె ఏడుస్తూ కింద పడిపోయింది. అయితే తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని మారుతీరావు సోదరుడు శ్రవణ్ చెబుతున్నారు. గత ఏప్రిల్ నుంచి మాటల్లేవని చెప్పుకొచ్చాడు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని సోదరుడు శ్రవణ్‌ చెబుతున్నారు.

Content above bottom navigation