మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ లో కూతురి గురించి ఎమోషనల్ వర్డ్స్..

75

తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ ప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, సెప్టెంబ‌ర్ 14న ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు,అంతే కాకుండా తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ప్రకటించాడు. మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ కేసులో మరొక ట్విస్ట్ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న ప్లేస్ లో ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికింది. ఆ లెటర్ లో కూతురు అమృతను ఉద్దేశించి కీలక విషయాలు రాశాడని సమాచారం. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో మారుతీరావు, అమృతకు రాయబారం పంపినట్లు తెలిసింది. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల కిందట విడుదలైన మారుతీరావు అప్పటి నుంచి కూతురు అమృతను వేధిస్తున్నట్లు తెలిసింది. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు మిర్యాలగూడ పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. కూతురు దూరమైందని తీవ్ర మనస్తాపంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు… ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసుల ఒత్తిడితోనే ఆయన చనిపోయినట్లు మారుతీరావు భార్య అంటున్నారు. ఇక మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న ప్లేస్ లో ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికినట్టు సమాచారం. ఆ లెటర్ లో మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కూడా వివరించాడని సమాచారం. తన కూతురు తనను వదిలేసి వెళ్ళినప్పుడే చనిపోవాలనున్నానని, కానీ నేను లేకపోతే తానూ ఏమవుతుందో అని అలోచించి వెనక్కి తగ్గానని, కానీ తన భర్తను చంపించినందుకు నా కూతురే నా మీద కక్ష్య కడుతుందని నేను అనుకోలేదని, నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరకు వస్తుందని ఆశించాను. కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు. ‘తల్లీ అమృత అమ్మ దగ్గరికి వెళ్ళిపో.. నేను లేక..నువ్వు లేక అమ్మ ఒంటరి అవుతుంది.’ అని సూసైడ్ నోట్‌లో రాసి ఉన్నట్లు తెలిసింది. ఈ ఒక్క విషయమే కాదు.. అమృత గురించి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఆ నోట్‌ను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తన తండ్రి మారుతీరావు ఆత్మహత్యపై కుమర్తె అమృత స్పందించింది. ఈ ఆత్మహత్యపై ఇప్పుడే ఏం మాట్లాడలేనని చెప్పింది. ‘నాన్న ఆత్మహత్యపై నాకు క్లారిటీ లేదు. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అసలు ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడే ఏమీ స్పందించలేను. అన్ని వివరాలు తెలిసాక స్పందిస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది.

Content above bottom navigation