మేడారం హుండీల్లో ఏం బ‌య‌ట‌కు వ‌స్తున్నాయో చూసి షాక‌వుతున్న అధికారులు

66

మేడారం మహా జాతర ముగిసింది.. వ‌న‌దేవ‌త‌ల జాత‌ర‌కు కోట్లాది మంది భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు
అమ్మ‌వార్ల‌కు త‌మమొక్కులు తీర్చుకున్నారు, అయితే వెంక‌న్న కోవెల‌కు ఎంత మంది భ‌క్తులు వ‌స్తారో తెలిసిందే.అలాగే వ‌న‌దేవ‌త‌ల జాత‌ర‌కు ప‌ట్నం నుంచి ప‌ల్లె నుంచి వ‌చ్చిన భ‌క్తుల‌తో మేడారం జ‌న‌జాత‌ర‌గా మారింది.మేడారం అంతా జ‌నాల‌తో భ‌క్తుల‌తో పుల‌కించిపోయింది, మ‌రి అమ్మ‌వార్ల‌కు మొక్కుబ‌డులు చెల్లించుకున్న వారు హుండీల్లో భారీగానే మొక్కులు తీర్చుకున్నారు, ఇక ప్ర‌భుత్వం అక్క‌డ ఆల‌య అధికారులు స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల హుండీ లెక్కింపు చేప‌ట్టారు.

మేడారం హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తి

ఈ హుండీల లెక్కింపు నిత్యం 3 షిఫ్టులుగా కొనసాగుతోంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ హుండీల లెక్కింపు గత ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. మొత్తం 494 హుండీలకుగాను ఇప్పటివరకు 341 హుండీలను లెక్కించారు.. రూ. 8 కోట్ల 76 లక్షల 37 వేల ఆదాయం వచ్చింది. మరో మూడు రోజుల పాటు ఈ హుండీల లెక్కింపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. భారీ పోలీస్ భద్రత మధ్య మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. గత ఏడాది మేడారం హుండీల లెక్కింపు ద్వారా 10 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈసారి దాదాపు 15 కోట్ల ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నెల 4 నుంచి 8 వరకు మేడారం జాతర సందర్భంగా దేవాదాయశాఖ సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవిందరాజు గద్దె ద‌గ్గ‌ర 25, పగిడిద్దరాజు గద్దె ద‌గ్గ‌ర 28 హుండీలతోపాటు, 38 క్లాత్‌, రెండు బియ్యం హుండీలను ఏర్పాటు చేసింది. మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో కానుకల లెక్కింపు ప్రారంభించారు., హుండీల్లో విదేశీ కరెన్సీతోపాటు రైద్దెన రూ.500, రూ.1000 నోట్లు లభించాయి, అయితే హుండీ లెక్కింపులో ఇప్పుడు వారికి స‌రికొత్త స‌మ‌స్య వ‌చ్చింద‌ట‌.

ఈ క్రింది వీడియో చుడండి

జాత‌ర స‌మ‌యంలో వ‌ర్షం ప‌డింది.. దీంతో బెల్లానికి చాలా వ‌ర‌కూ నోట్లు అంటుకుపోయాయి.. వాటిని వేరుచేసి ఆ నోట్ల‌ని క‌డిగి ఎండ‌బెట్టి మ‌రీ లెక్కిస్తున్నారు.. ఇలా అనేక స‌మ‌స్య‌లు లెక్కింపు కేంద్రం ద‌గ్గ‌ర క‌నిపిస్తున్నాయి. ఇక హుండీల్లో ఫారెన్ క‌రెన్సీ అలాగే ర‌ద్దైన వెయ్యి 500 రూపాయ‌ల నోట్లు క‌ట్ట‌లు క‌ట్ట‌లుగా కూడా వేశారు. అలాగే బంగారు వెండి క‌డియాలు కూడా ద‌ర్శ‌నం ఇస్తున్నాయి. కుంకుమ భ‌రిణెలు అమ్మ‌వారి ముక్కుపుడ‌క‌లు ప్ర‌తిమ‌లు కూడా వ‌స్తున్నాయి.ఉంగ‌రాలు ర‌త్నాలు బంగారు గొలుసులు కూడా స‌మ‌ర్పించుకున్నారు.మొత్తం హుండీల్లో బియ్యం చిల్ల‌ర తీయ‌డానికి ఓక టీం.బంగారు వెండి వ‌స్తువులు లెక్కించే టీమ్ మ‌రొక‌రు.ఇక వాటికి అంటుకున్న బెల్లం ప‌సుపు మ‌ర‌క‌లు స‌ర్ఫ్ తో తొల‌గించే టీమ్.వాటిని ఎండ‌బెట్టి లెక్కించే టీమ్ మ‌రొక‌రు.ఇలా ఐదారు టీమ్ లు అక్క‌డ న‌గ‌దు లెక్కింపు చేస్తున్నారు.ఇక బ్యాంకు వారు కూడా ప‌సుపు కుంకం మ‌ర‌క‌లు చిరిగిన అంటుకుపోయిన నోట్లు తీసుకుంటాము అంటున్నారు.బంగారు వెండి వ‌స్తువులు జ్యూవెల‌రీ విభాగం ఆఫీసర్ హైద‌రాబాద్ నుంచి వ‌చ్చి వాటి విలువ లెక్కిస్తార‌ట‌..చిల్ల‌ర చివ‌రి రోజున లెక్కిస్తారు అని తెలుస్తోంది.ప్ర‌తీ రోజు లెక్కించిన హుండీ ఆధాయం, సాయ‌త్రం దేవాదాయ శాఖ బ్యాంకు అకౌంట్లో జ‌మ చేస్తున్నారు అధికారులు.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation