హైదరాబాద్ లో ఘోర విషాదం ప్రేమించలేదని యువతిని రోడ్డుపై నిప్పు అంటించిన ఉన్మాది

1685

విజయవాడలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ ఉన్మాది యువతిపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మంటలు అంటుకోవడంతో యువకుడు కూడా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చిన్నారి విజయవాడలోని కొవిడ్ సెంటర్లో నర్సుగా పనిచేస్తోంది.

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

ఆసుపత్రి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం గత కొంతకాలంగా ప్రేమ పేరుతో చిన్నారిని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో నాలుగు రోజుల క్రితం చిన్నారి గవర్నర్పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పిలిపించిన పోలీసులు అతడిని హెచ్చరించారు. ఇకపై ఆమెను వేధించబోనని రాసివ్వడంతో యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది.

పోలీసులు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని నాగభూషణం నిన్న రాత్రి డ్యూటీ అనంతరం యువతి ఒంటరిగా నడుచుకుని రూముకు వెళ్తుండగా కాపు కాసిన నాగభూషణం ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పటించాడు. ఈ క్రమంలో అతడికి కూడా మంటలంటుకున్నాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నిందితుడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈటీవీకి హ్యాండిచ్చిన యాంకర్ ప్రదీప్ ఆమె కోసం మరో ఛానల్ లోకి ఎంట్రీ

సోహెల్-కుమార్ సాయి మద్య ఫైట్ కి కారణం ఇదే…

మోనాల్ తో అభి బ్రేకప్..రొమాన్స్ తో రెచ్చిపోయిన అఖిల్ అభి- హారికల కొత్త లవ్ స్టోరీ..

గంగవ్వ కోసం ఖరీదైన ఇల్లు రెడీ చేసిన నాగార్జున దాని విలువ ఏకంగా ఎంతో తెలుసా?

Content above bottom navigation