కరోనా రోగినంటూ మాల్‌లో యువకుడు ప్రాంక్ వీడియో.. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు!

96

ప్రపంచమంతా కరోనా వైరస్‌‌‌పై కలవరపెడుతుంటే.. కొందరు దీన్ని అవకాశంగా చేసుకుని ఫేక్ వార్తలు, వీడియోలను జనాల్లోకి వదులుతున్నారు. ప్రజల భయాన్ని చూసి నవ్వుకొనేందుకు పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ మీద ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ మీద వీడియోలు చేసి యూట్యూబ్ తో పైసలు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారు. అలా కరోనా వైరస్ మీద వీడియో చేసి క్యాష్ చేసుకోవాలనుకున్న ఒక యువకుడు ప్లాన్ అడ్డం తిరిగి దొరికిపోయాడు.

Image result for coronavirus

అమెరికాకు చెందిన టైరల్ వ్యాలెస్ అనే యువకుడికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో వీడియోలు పోస్ట్ చేసి జనాలను ఆకట్టుకుంటుంటాడు. ఇతని వీడియోస్ కు అంత గొప్పగా వ్యూస్ ఏమి రావు. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేసి వీడియోలకు వ్యూస్ రప్పించుకోవాలని అనుకున్నాడు. దానికోసం కరోనా వైరస్ ను వాడుకోవాలనుకున్నాడు. దానికి ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం, ఇల్లినాయిస్‌ లోని వాల్మర్ట్ మాల్‌‌ కు వెళ్లాడు. ముక్కు మాస్క్ పెట్టుకుని, తన టీషర్టు వెనుక ‘నాకు కరోనా వైరస్’ ఉందని రాసిన కాగితాన్ని అంటించుకున్నాడు. మాల్‌లో తిరుగుతూ నేలను శుభ్రం చేయడానికి ఉపయోగించే ‘లైజాల్’ క్రిమీ సంహారకాన్ని స్ప్రే చేస్తూ నడించాడు. అతడిని అలా చూడగానే మాల్‌ లో ఉన్న కస్టమర్లు హడలిపోయారు. అతడిని అలా చూడగానే మాల్‌ లో ఉన్న సిబ్బంది హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్‌కు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అతడిపై మాల్‌ లోకి అక్రమ చొరబాటు, ప్రజలను భయాందోళనలకు గురిచేయడం వంటి కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై పోలీస్ అధికారి క్రిస్ బాట్జామ్ మాట్లాడుతూ.. ‘‘అతడు ప్రాంక్ చేయాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ పేరుతో అతడు హద్దులు దాటాడు. ప్రస్తుతం చికాగోలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఓ జంటలో కరోనా వైరస్‌ను గుర్తించారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్‌పై అప్రమత్తమైంది. ఇలాంటి సమయంలో అక్కడి యువత ఇలాంటి ప్రాంక్‌ లను చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ఇటీవల కెనడాకు చెందిన ఓ యువకుడు కూడా ఇదే విధంగా ప్రాంక్‌కు పాల్పడ్డాడు. విమానంలో ప్రయాణిస్తూ.. తనకు కరోనా వైరస్ ఉందనే అనుమానం కలుగుతోందని బిగ్గరగా అరిచాడు. తాను చైనా నుంచి వస్తున్నా అని, తన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. దీంతో విమానంలోని ప్రయాణికులంతా హడలిపోయారు. దీంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించాడు. మాంటేగో బే విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా కొందరు కరోనా వైరస్ మీద ప్రాంక్ చేసి కటకటాలపాలవుతున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation