ఈరోజు నుంచి ఆ బ్యాంకులు కనిపించవు! ఖాతాదారులకు హెచరిక

152

సుదీర్ఘ కాలంగా ప్రజలకు సేవలందిస్తున్న కొన్ని బ్యాంకులు ఈరోజు నుంచి కనుమరుగు కానున్నాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకుల్ ఆస్థానంలో నాలుగు బ్యాంకులు మాత్రమె ఈరోజు నుంచి కనిపిస్తాయి. కనుమరుగు కానున్న బ్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పురాతన బ్యాంకు ఆంధ్రాబ్యాంకు కూడా ఉంది. దేనితో పాటు అలహాబాద్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు ఇక కనిపించవు.

– ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ లు విలీనమై ఇక ఇండియన్ బ్యాంక్ గా పనిచేస్తాయి.

– పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు బ్యాంకుల స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పనిచేస్తుంది.

– కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ లు ఇకపై కెనరా బ్యాంక్ గా కనిపిస్తాయి.

– యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్ మూడు కలిసి యూనియన్ బ్యాంక్ గా సేవలందిస్తాయి.

ఇక ఈ మెగా విలీనంతో ఈరోజు నుంచి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 కు పరిమితమవ్వనుంది. అయిత, ఈ విలీనం ఆయా బ్యాంకుల ఖాతాదారుల పై ఏవిధమైన ప్రభావం పడబోతోంది? ఎకౌంట్ నెంబర్లు మారతాయా? ప్రస్తుతం ఉన్న డెబిట్, క్రెడిట్ బ్యాంకుల సంగతేంటి? ఇక రుణాల విషయంలో ఈ విలీనం తరువాత నిబంధనలు ఎలా మారబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

మెగా విలీనం : ఈరోజు నుంచి ఆ బ్యాంకులు కనిపించవు!

ఎకౌంట్ నెంబర్ ప్రస్తుతం మారదు..

ఎకౌంట్ హోల్డర్స్ ఎకౌంట్ నెంబర్లు మారబోవు. అదేవిధంగా ప్రస్తుతం వారి వద్ద వున్నా చెక్ బుక్లు యధావిధిగా పనిచేస్తాయి. అదే విధంగా ఏటీఎం కార్డులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపయోగపడతాయి. ఆంధ్రాబ్యాంక్ చెక్ బుక్ ఉన్న వారు అదే చెక్ ను యూనియన్ బ్యాంక్ లో కానీ, కార్పోరేషన్ బ్యాంక్ లో కానీ నగదు బదిలీ కోసం ఉపయోగించవచ్చు. ఇక ఏటీఎం కార్డులు కూడా ఈ మూడు ఏటీఎం కేంద్రాల్లో ఎటువంటి అదనపు రుసుముల భారం లేకుండా ఉపయోగించుకోవచ్చు. భవిష్యత్ లో టెక్నికల్ గా ఒకవేళ ఖాతా నెంబరు మార్చాల్సిన పరిస్థితి వస్తే బ్యాంకు ఖాతాదారులకు సమాచారం ఇస్తుంది. ఒక ఖాతాదారునికి ఒకే కస్టమర్‌ ఐడీ ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన. దీని ప్రకారం భవిష్యత్తులో ఏ కస్టమర్‌ ఐడీని కొనసాగించాలనేది ఖాతాదారుడు స్వయంగా నిర్ణయించుకోవచ్చు. ఇక విలీనం అవుతున్న బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్‌ కార్డులు గడువు ముగిసేంత వరకూ చెల్లుబాటు అవుతాయి. గడువు అనంతరం కొత్త బ్యాంకు నిబంధనల మేరకు క్రెడిట్‌ కార్డుల్ని జారీ చేస్తాయి. కార్డుదారుడికి ఇప్పటివరకూ లభించిన రివార్డ్‌ పాయింట్లు ఆ కార్డుకు బదిలీ అవుతాయి.

లోన్లు, డిపాజిట్లు ఇలా..

ప్రస్తుతం బ్యాంకు లోన్లు తీసుకున్నవారికి ఆయా బ్యాంకు నిబంధనలే అమలులో ఉంటాయి. అంటే ఆంధ్రాబ్యాంక్ లో గృహ ఋణం తీసుకున్న వారికీ ఆ సమయంలో ఏ రకమైన నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు విలీనం తరువాతా కొనసాగుతాయి. రుణ కాలపరిమితి ముగిసే వరకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఇక ఇప్పటికే మంజూరు అయి నగదు విడుదల కాని రుణ గ్రహీతలు విలీన బ్యాంకుల నుంచి నగదు తీసుకోవచ్చు. ఇక రుణం తీసుకునే సమయంలో తీసుకున్న అసెట్‌ ఇన్సూరెన్స్‌, లయబిలిటీ ఇన్సూరెన్స్‌ వాటి కాల పరిమితి ముగిసే వరకూ కొనసాగుతాయి.

బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వారికీ కూడా ఆయా డిపాజిట్ల పై ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో, డిపాజిట్ చేసిన సమయంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవే నిబంధనలు విలీనం తరువాతా కొనసాగుతాయి. అయితే, విలీనం తరువాత చేసే డిపాజిట్లకు మాత్రం విలీన బ్యాంక్ నిబంధనలు వర్తిస్తాయి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్..

ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వర్డ్ లు యధాతథంగా పనిచేస్తాయి. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఏటీఎం, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి డిజిటల్‌ సేవలు విలీన బ్యాంకులు ఎప్పటిలా కొనసాగిస్తాయి. ఇక ఈ సేవల్లోఎవైనా మార్పులు చోటు చేసుకుంటే, బ్యాంకులు వినియోగదారులకు తెలియజేస్తాయి. వినియోగదారుల ప్రస్తుత బ్యాంకులో నమోదైన మొబైల్‌ నెంబరు, ఈమెయిల్‌కు ఇప్పుడు వస్తున్నట్లే సమాచారం లభిస్తుంది.

Content above bottom navigation