ఆకాశంలో అద్భుతం… ఒకేసారి ఐదు సూర్యోదయాలు.

117

మ‌న‌కు ఉద‌యం సాయంత్రం రాత్రి ఇలా మూడు స‌మ‌యాలు ఉంటాయి..ఉద‌యం సూర్యుడు ఉద‌యిస్తాడు సాయంత్రం అస్త‌మిస్తాడు.అయితే తూర్పున మాత్ర‌మే సూర్యుడు ఉద‌యిస్తాడు.. ఇది ఎక్క‌డైనా సాధార‌ణం.. కాని ఇక్క‌డ ఓ వింత సంఘ‌ట‌న జ‌రిగింది.మ‌రి ఆ సంఘ‌ట‌న గురించి తెలుసుకుందాం.ఉత్తర చైనా… ఇన్నర్ మంగోలియా ప్రావిన్స్ ప్రజలు… ఆ రోజు ఉదయాన్నే తూర్పు వైపు చూశారు. అది అన్ని రోజుల లాంటిది కాదు. ప్రత్యేకమైనది. ఆ రోజు ఒకేసారి ఐదు సూర్యోదయాలు కనిపిస్తాయి. అవును వినడానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం.. అంద‌రూ అనుకున్నట్లే ఆ రోజు తూర్పున ఐదు సూర్యోదయాలు కనిపించాయి… దీంతో అంతా పరమానందం పొందారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చైనాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ… ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది.

Image result for sunset

ప్రజలంతా ఈ దృశ్యాన్ని చూసి… వావ్… భలే ఉంది… నా కళ్లతో నేనే నమ్మలేకపోతున్నా… అంటూ ఆశ్చర్యపోయారు. అది సరే… ఇదెలా సాధ్యం అన్న డౌట్ మనకు రావడం సహజం. ఎందుకంటే… మనకు ఉన్నది ఒక్కడే సూర్యుడు కదా. తెల్లారితే ఉదయించేది ఒక్క సూర్యుడేగా. అలాంటప్పుడు ఐదు సూర్యోదయాలు ఎలా కనిపిస్తాయి తెలుసుకుందాం.ఈ ప్రకృతి వింత వెనక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇలా జరగాలంటే వాతావరణంలో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. ఆ సమయంలో… వాతావరణంలో మంచు బిందువులు గాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. సూర్యుడి కాంతి కిరణాలు వాటిపై పడి… అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ వీడియోలో మధ్యలో ఉన్నది అసలైన సూర్యుడు. అటూ, ఇటూ రెండువైపులా ఉన్నవి ప్రతిబింబపు సూర్యోదయాలు. మన ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు. అలాంటి వాటిలో ఒకటైన ఈ వింతను చూసి అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు…. ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తున్నారు. మీరు చూడ‌వ‌చ్చు అవి ఎంత ప్రకాశవంతంగా రిప్లెక్ట్ అవుతున్నాయో.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ ఐదు సూర్యోదయాల్లో ఒకటి గ్రహాంతర వాసులది కావచ్చని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. పొల్యూషన్ వల్లే ఇలా కనిపిస్తోందా అని మరో యూజర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది అద్భుతంగా ఉంది… చాలా బాగుందని మరో యూజర్ తెలిపారు. ఇలా అంతా దీనిపై స్పందిస్తుంటే… ఈ వీడియో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే సైన్స్ పై మంచి నాలెడ్జ్ ఉన్న‌వారు దీని అస‌లు సంగ‌తి కూడా కింద కామెంట్లు పెడుతున్నారు… ఈ స‌మ‌యంలో చాలా మంది దీన్ని రీట్వీట్ చేస్తున్నారు.. మ‌రి మీరు కూడా ఈ స‌న్ మాయాజాలం చూడండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation