మారుతీరావుకు ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరుగుతుంది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో అమృత – ప్రణయ్‌ల ప్రేమ ఉదంతం ఒకటి. కులాంతర వివాహం చేసుకుందని కూతురు మీద కోపంతో.. దారుణంగా అల్లుడిని చంపించాడు మారుతీరావు. అనంతరం ఈ హత్య కేసులో 7 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకోడానికి కూతురితో ఎన్నో రకాలుగా రాయబారాలు జరిపినా ఆమె స్పందించలేదు. అంతేకాకుండా తనను తన తండ్రి తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నాడని మరొక కేసు పెట్టింది. అలాగే ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ప్రెషర్ ఎక్కువైంది. అలాగే ప్రణయ్ హత్య కేసు కూడా హియరింగ్‌కి రావడంతో ఒత్తిడి తట్టుకోలేక పోయిన మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సోమవారం నాడు అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయ్యాయి. అమృత, ఆమె బాబాయ్ శ్రవణ్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఇలా ఉంటె.. ఇప్పుడు మారుతీరావు ఆస్తి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

మారుతీ రావు వీలునామా ఒకటి బయటపడింది. అతను తన భార్య గిరిజ, తమ్ముడు శ్రవణ్ ల పేరు మీదనే వీలునామా రాసినట్టు సమాచారం. మారుతీరావు రాసిన వీలునామా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తానెంతగానో ప్రేమతో చూసుకున్న కుమార్తె, ఇక తన వద్దకు రాదని భావించిన మారుతీరావు కొంతకాలం క్రితమే తన వీలునామాను మార్చి రాశారు.

Image result for maruthirao

తన యావదాస్తిలో సగం తమ్ముడు శ్రవణ్ పేరిట, మిగతాది భార్య గిరిజ పేరిట రాసిన ఆయన, దాన్ని రిజిస్టర్ కూడా చేయించారు. వీటి కాపీలు ఇప్పుడు పోలీసుల అధీనంలో ఉన్నాయి. మొదట కిరోసిన్ డీలర్‌గా వ్యాపారం చేసిన మారుతీరావు.. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్ మొదలు పెట్టారు. అనంతరం రైస్ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు.

ఒక్కసారి చార్జ్ షీట్‌లో మారుతీరావు ఆస్తుల వివరాలలోకి వెళ్తే.. :

  1. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయం
  2. అమృత ఆస్పత్రి పేరుతో వంద పడకల ఆస్పత్రి
  3. భార్య గిరిజ పేరుతో పది ఎకరాల భూమి
  4. హైదరాబాద్ కొత్తపేటలో 400 గజాల స్థలం
  5. హైదరాబాద్‌ లో పలు చోట్ల 5 ఫ్లాట్లు
  6. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్
  7. ఈదులగూడెం క్రాస్ రోడ్‌లో మరో షాపింగ్ మాల్
  8. మారుతీ రావు తల్లి పేరుతో రెండంతస్తుల భవనం
  9. మిర్యాల గూడ బైపాస్ రోడ్‌లో 22 గుంటల భూమి

ఇలా మారుతిరావుకు భారీగానే ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం ఆస్తుల విలువ రూ.200 కోట్లు.. అలాగే మారుతీరావుకి బినామీలు కూడా ఉన్నట్లు అమృత చెప్పింది. మరి బినామీల లెక్కన ఇంకెంత ఆస్తి ఉందో తెలియాలి.

Content above bottom navigation