కాలువలో కొట్టుకొచ్చిన కారు.. కారులో 5 మృతదేహాలు.. ఎవరివో తెలిసి కుప్పకూలిన KCR

125

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మనోహర్ రెడ్డి సోదరి రాధికరెడ్డి కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత నెల 27వ తేదీన ఇంటినుంచి భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్ర కలిసి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పి బయల్దేరారు. కానీ వారి కారు కాకతీయ కెనాల్‌ లో పడిపోయింది. అప్పటినుంచి వారి ఆచూకీ లేదు.

20 రోజుల క్రితం అదృశ్యమైన రాధిక కుటుంబ సభ్యలు పూర్తిగా కుళ్లిన శవాలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నిన్న సాయంత్రం బైక్‌పై వెళుతున్న ఓ జంట ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. దీంతో సోమవారం కారు కనిపించింది. కారు బయటికి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి ముగ్గురిని బయటకు తీశారు.

కారు నంబర్ AP15 BN 3438 ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధికది అని గుర్తించారు. కారులో రాధిక, భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్ర ఉన్నారు. గత 20 రోజుల నుంచి కెనాల్‌లో పడి ఉండటంతో మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నాయి. ఘటనాస్థలానికి కరీంనగర్ కలెక్టర్, పోలీసు కమిషనర్ కమలహాసన్ రెడ్డి చేరుకొన్నారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. రాధిక కుటుంబం మిస్సింగ్ అని తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీపీ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు.

Image result for ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం

అయితే జనవరి 27 న బయటకు వచ్చిన రాధిక కుటుంబం ఇప్పటి వరకు కనిపించకపోయినా ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగింది.. ఇది ప్రమాదమా? లేక కుట్ర కోణమా? అనేది మిస్టరీగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు జరుపుతున్నారు. ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకుండా పోయినా పోలీసులకు ఫిర్యాదు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Image result for ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట్లో విషాదం

ఘటనాస్థలానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేరుకొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. ఈ ప్రమాద ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. జనవరి 27న సాయంత్రం కరీంనగర్ నుంచి తన సోదరి, బావ వారి కూతురు కారులో బయటకు వెళ్లారని చెప్పారు. అప్పటి నుంచి వారి ఫోన్ కలవలేదన్నారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినా సమాచారం దొరకలేదన్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని అనుకున్నామని తెలిపారు. సోదరి కుటుంబం మిస్సింగ్ పై ఆందోళనలో ఉన్నామని, ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. తన సోదరి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు. వారి కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవన్నారు. అసలేం జరిగిందో తనకూ తెలియదన్నారు. తన సోదరి కుటుంబం తరుచూ విహార యాత్రలకు వెళ్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు. తన సోదరి కొడుకు మూడేళ్ల క్రితం కారు ప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్యే తెలిపారు. రాధిక టీచర్‌గా పనిచేస్తోండగా, సహస్ర మెడిసిన్ చదువుతోన్నారు. చెల్లెలు, బావ వారి కూతురు మృతితో ఎమ్మెల్యే దాసరి మనోహర్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Content above bottom navigation