రూ.3కే కిలో బియ్యం, రూ.2కే గోధుమలు, కార్మికులకు వేతనంతో సెలవు.. మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు

115

కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ 3,00,000 మందికి సోకగా 21, 000 మందికి పైగా మృతి చెందారు. భారత్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 500 కు చేరింది. దేశంలో వైరస్ దెబ్బకు రోడ్లన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావడం లేదు. మొదట్లో చైనాను ఈ వైరస్ అతలాకుతలం చేయగా ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. ఇటలీలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది.. కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ వైరస్ పై భారత ప్రభుత్వం గట్టిగానే పోరాడుతుంది. భారత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఇప్పుడు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ స్పందించారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ అనుష్క శర్మ

We asked women what they would tweet from PM Modi's account. Here ...

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. దీనికి ప్రజలంతా మద్దతుగా నిలిచి కరోనా వైరస్‌ నిరోధానికి కట్టుబడి ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కోరారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని.. క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం (మార్చి 25) మధ్యాహ్నం ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ మాట్లాడారు. 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పేదలకు ఇబ్బంది కలగుకుండా.. 2 రూపాయలకే కిలో గోధుమలు, 3 రూపాయలకు కిలో బియ్యం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

క‌రోనా నివార‌ణ‌కు సోష‌ల్ డిస్టాన్సింగే ఏకైక మార్గమని తెలిపారు. అయితే.. ప్రజలందరికీ అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయ‌ని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పాలు, నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు నిర్ణీత సమయం వరకు తెరిచే ఉంటాయని జవదేకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని సూచించారు. ఒప్పంద ఉద్యోగులతో పాటు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను అందరూ పాటించాలని కోరారు. కరోనా వైరస్‌ ప్రభావాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుందని.. ఇది తప్పసరి చర్య అని వివరించారు. ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. వైద్యులు, జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ఇతోధిక సేవ చేస్తున్నారని జవదేకర్‌ ప్రశంసించారు.

Content above bottom navigation