బిగ్ బ్రేకింగ్ : రంగం లోకి ఆర్మీ.. మోడీ సంచలన నిర్ణయం

149

వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయడం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు అమలు చేయబోతున్నారు. మార్చి 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలవుతున్న ఈ నిబంధన కారణంగా పేద, మధ్యతరగతి వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం వంటివి చేస్తున్నా, తీవ్ర కష్టనష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ నిబంధన ముగుస్తుందని అందరూ ముందుగా భావించారు. కానీ మే మూడో తేదీ వరకు ఈ నిబంధన విధించడంతో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వలస వెళ్ళిన కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆ విధంగానే ముంబై లోని బాంద్రా లో మంగళవారం వలస కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరిలో ఎక్కువమంది ఉత్తర భారతదేశానికి చెందినవారే ఉన్నారు. సుదీర్ఘకాలం లాక్ డౌన్ ను అమలు చేస్తుండడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కుటుంబాలకు దూరంగా ఇక్కడ ఉంటున్నామని, ప్రస్తుతం తమకు తినేందుకు భోజనం, ఉండేందుకు చోటు కరువయ్యింది అని వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం ముందస్తు హెచ్చరికలు చేయకుండా లాక్ డౌన్ ను అమల్లోకి తేవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వలస కూలీలు చెబుతున్నారు. లాక్ డౌన్ ను ఇంత పటిష్టంగా అమలు చేస్తున్న సమయంలో బాంద్రాలో వలస కూలీలు వేల సంఖ్యలో రోడ్ల మీదకు రావడం ఆందోళన చేయడంపై కేంద్రం సీరియస్ గానే ఈ విషయాన్ని పరిగణిస్తోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ఇప్పటికే వలసకూలీ అండగా ఉంటామని ప్రకటించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత అందరూ సొంత ఊళ్లకు వెళ్లొచ్చని ప్రకటించారు. తమకు తినేందుకు కనీసం తిండి దొరకడం లేదని వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంద్రాలో వలస కూలీల ఆందోళనను స్ఫూర్తిగా తీసుకుని మిగతా రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్నట్లుగా కేంద్రానికి నివేదికలు అందడంతో అవసరమైతే దేశవ్యాప్తంగా ఆర్మీ బలగాలను రంగంలోకి దించాలని, ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, వారికి భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే లాక్ డౌన్ ను సరిగ్గా పాటించని ప్రదేశాలలో కూడా ఇండియన్ ఆర్మీని రంగంలోకి దించి లాక్ డౌన్ కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నా ఆలోచనలో కేంద్రం ఉంది.

Content above bottom navigation