Most Amazing chemical reactions

మనం చిన్నప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్ లో ఒక కెమికల్ తో మరొక కెమికల్ ను కలిపి కొన్ని ప్రయోగాలు చేశాం.అప్పుడు కొన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి. అయితే అవి చాలా చిన్న కెమికల్ రియాక్షన్స్. ఒక పదార్థంతో మరొక పదార్థం రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్ అప్పుడప్పుడు వింతగా, భయంకరంగా కూడా మారుతుంది. అలాంటి కొన్ని అద్భుతమైన కెమికల్ రియాక్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. సోడియం పాలి అకిలైట్ అండ్ వాటర్… ఈ రెండు పదార్థాలను కలిపితే అందులో ఒక జెల్ లాంటి పదార్థం వస్తుంది. దాని కలర్, అది కనిపించే విధానం చుస్తే అచ్చం మంచు లాగానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు దానిని ఫేక్ స్నో రియాక్షన్ అని కూడా అంటారు.
  2. బ్రోమిన్ అండ్ యాసిడ్….
    బిజీ రియాక్షన్ బ్రోమిన్, యాసిడ్ లో ఉండే చైన్ రియాక్షన్ ను రీప్రెసెంట్ చేస్తుంది. ఈ బిజీ రియాక్షన్ ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందంటే, దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. బ్రోమిన్ యాసిడ్ లో ఏదైనా ఇతర కెమికల్ ను కలిపితే ఆ మిక్సర్ అనేక రియాక్షన్స్ ను ఇస్తుంది. దానినే బిజీ రియాక్షన్ అంటారు. ఆ కెమికల్ రియాక్షన్ చాలా స్ట్రేంజ్ గా కనిపిస్తుంది. దానిని చుస్తే అది బతికి ఉందేమో అని అనిపిస్తుంది.
  3. హైడ్రోజన్ పెరాక్సయిడ్ అండ్ పొటాషియం అయోడైడ్…
    ఎప్పుడైతే హైడ్రోజన్ పెరాక్సయిడ్ అండ్ పొటాషియం అయోడైడ్ కలుస్తాయో అప్పుడు ఒక పెద్ద కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ నే ఎలిఫెంట్ టూత్ పేస్ట్ అంటారు. ఎందుకంటే ఈ రియాక్షన్ వ్యూ ఎలా ఉంటుందంటే, అందులో నుంచి ఎలిఫెంట్ టూత్ పేస్ట్ బయట పడుతున్నట్టు ఉంటుంది.
Image result for chemical reaction
  1. కోక్ అండ్ లిక్విడ్ నైట్రోజన్..
    యూనిటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన మార్టిన్ పోలైకాఫ్ కెమికల్ ఎక్సపరిమెంట్స్ చెయ్యడంలో ఫెమస్. ఒకసారి అతను కోక్ ను నైట్రోజన్ లిక్విడ్ లో వేస్తె ఏమవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.అలాగే ఆ ఎక్స్పరిమెంట్ ను రికార్డ్ చేద్దామని అనుకున్నాడు. అతను కోక్ క్యాన్ ను నైట్రోజన్ లిక్విడ్ యొక్క కోల్డ్ టెంపరేచర్ లో ఉంచాడు. ఆ తర్వాత ఆ కోక్ క్యాన్ పగిలింది. కోక్ లో ఉన్న co2 తొందరగా ఫ్రీజ్ అవ్వదు. కానీ క్యాన్ లో ఉన్న లిక్విడ్ ఫ్రీజ్ అయ్యింది.
  2. ఎక్స్ప్లోజివ్ సీజియం అండ్ వాటర్…
    ఇది చాలా భయంకరమైన కెమికల్ రియాక్షన్. CGM వాటర్ తో కలిసినప్పుడు దాని రియాక్షన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. CGM అనేది ఒక ధాతువు. ఇది నీటిలో ఈజీగా కలిసిపోతుంది. దాని రియాక్షన్ కారణంగా అది నీటితో కలిసినప్పుడు బాంబ్ లాగా బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ లో మెరుపులు అండ్ వైట్ పొగ కూడా వస్తుంది. దాని కెమికల్ రియాక్షన్ చాలా వేడిగా ఉంటుంది. ఈ రెండు కెమికల్స్ కలిసి CGM హైడ్రాక్సయిడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ను రిలీజ్ చేస్తాయి. ఈ రియాక్షన్ మిల్లి సెకండ్స్ లలో జరిగిపోతుంది.

ఇవేనండి కొన్ని భయంకరమైన, అద్భుతమైన కెమికల్ రియాక్షన్. వీటి గురించి వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అయితే వీటిని మీరు సొంతంగా ప్రయోగించకండి. ఒక్కొక్కసారి బ్లాస్ట్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి డోంట్ ట్రై.

Content above bottom navigation