దేశంలో అందమైన లేడి ఆఫీసర్స్ వీళ్ళే…

67

మన దేశంలో ప్రజా సేవకు అంకితం అయిన మహిళా అధికారులకు కొదవ లేదు. వారిలో కొందరు తమ పని తీరుతో పేరు తెచ్చుకుంటే, మరికొందరు పనితీరుతో పాటు తమ అందంతో ఎంతో పాపులర్ అయ్యారు. అలాంటి అందమైన ఆఫీసర్లకు సినీ తారలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కొంతమంది లేడి IAS & IPS ఆఫీసర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

voice…

 • స్మిత సబర్వాల్ :
  ఈమె జన్మస్థలం పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్. 1977 లో జన్మించ్చిన స్మిత సబర్వాల్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2001 లో IAS ఆఫీసర్ గా నియమితురాలయ్యారు. IAS ఆఫీసర్ గా తెలంగాణలో నియమితురాలయిన స్మిత సబర్వాల్ కి ప్రజల మనిషి అని పేరుంది. ఇక CM KCR ఆధ్వర్యంలో అపాయింట్ అయిన మొట్ట మొదటి లేడీ ఆఫీసర్ స్మిత సబర్వాలే. ఆమె భర్త మనందరికీ తెలిసిన అకున్ సబర్వాల్. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ను హ్యాండిల్ చేస్తుంది అకున్ సబర్వాలే కావడం విశేషం.
Image result for smitha sabharwal
 • రీజు బఫ్న :
  ఈమె స్వస్థలం చత్తిస్ ఘడ్. రీజు బఫ్న ఢిల్లీ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉన్నత విద్యావంతురాలయ్యింది. ఈమె 2013 బ్యాచ్ IAS అధికారి కాగా, ఆమె భర్త ఏ వి ఐ ప్రసాద్ కూడా ఐఏఎస్ అధికారే. లైంగిక వేధింపులపై మడమ తిప్పని పోరాటం చెయ్యడం ద్వారా దేశంలోని అనేక మంది మహిళకు ఆదర్శప్రాయంగా నిలిచింది రీజు.
Image result for reeju bafna
 • మెరింజోషిఫ్ :
  ఈమె స్వరాష్టం కేరళ. ఆమె 2012 బ్యాచ్ కి చెందిన ఓ IPS అధికారి. ఢిల్లీ కి చెందిన ఈమె కేరళలో ఎంతో శక్తి వంతమైన అధికారిని గా ఎంతో పేరు తెచ్చుకుంది. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎం ఏ చదివిన ఈమె మొదటి ప్రయత్నంలోనే IPS అధికారి గా ఎంపికై సంచలనం సృష్టించింది. 2015 లో కొట్టాయం కి చెందిన సైకాలజిస్ట్ క్రిస్ అబ్రాహామును పెళ్లాడింది.
Image result for merin joseph
 • కాంచన చౌదరి భట్టాచార్య..
  1973 నుంచి 2007 వరకు పనిచేసిన IPS ఆఫీసర్ ఈమె. దేశంలోనే మొట్టమొదటి DGP గా పనిచేసిన మహిళ ఈమె. ఈమెది హిమాచల్ ప్రదేశ్. ఢిల్లీలోని ఇంద్రపస్త కాలేజ్ లో ఇంగ్లిష్ లిటరేచర్ లో MA చేశారు. ఈమెకు ఉన్న అవార్డులు, రివార్డులు ఎన్నో. ప్రస్తుతం ఆమె అమ్ అద్మి పార్టీ లో జాయిన్ అయ్యింది. 2014 ఎన్నికలలో హరిద్వార్ నుంచి విజయం సాదించింది. అయితే 2019 ఆగస్టు 26 న ఈమె చనిపోయింది.
Image result for kanchan chaudhary bhattacharya
 • మీరా బొర్వాంకర్…
  పంజాబ్ రాష్టానికి చెందిన మీరా 1981 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారిని. జలంధర్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. మహారాష్ట్ర క్యాడర్ లో ఫస్ట్ లేడి IPS ఆఫీసర్ ఆమె. దావుద్ ఇబ్రహీం, చోటారాజన్ లను అరెస్ట్ చెయ్యడంతో వరల్డ్ ఫెమస్ అయ్యింది. అంతేకాదు ఈమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో మర్దానీ అనే సినిమా కూడా తెరకెక్కింది.
Image result for meera borwankar
 • సంజుక్త పరాస్కర్ :
  1979 లో అస్సాం లో జన్మించిన ఈమె 2006 లో IPS అధికారి గా భాద్యతలు చేపట్టింది. అస్సాం లోనే పెరిగిన ఈమె ఢిల్లీ ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్సు లో గ్రాడ్యుయేషన్ చేసింది. సంజుక్త పరాస్కర్ మొట్ట మొదట అస్సాం నుంచి ఎంపికైన మొట్ట మొదటి IPS అధికారిని కావడం విశేషమని చెప్పుకోవాలి. ఇక అస్సాం ను అతలాకుతలం చేస్తున్న బోడో మిల్టాన్ల భరతం పట్టడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. ఆమె భర్త పురావ్ గుప్త కూడా IAS అధికారి గా పని చేస్తున్నారు.
Image result for samjukta parakar
 • రోషన్ జాకోబ్..
  ఈమె కేరళలో 25 డిసెంబర్ 1978 లో జన్మించారు. 2004 లో IAS కు ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో గొండా జిల్లాలో సేవలు అందిస్తున్నారు.
Image result for roshan jacob
 • వందన ప్రేయసి :
  ఈమె 2003 బ్యాచ్ కి చెందిన ఆఫీసర్. బీహార్ లోని శివాని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా వ్యవహరిస్తోంది. అల్లర్లు అణిచి వేయడంలో , విధ్వంసాలు జరగకుండా అరికట్టడంలో వందన ప్రేయసి ఎంతో సమర్ధురాలుగా పేరు తెచ్చుకుంది.
Image result for vandana preyasi
 • బి. చంద్రకళ :
  ఈమెది మన తెలుగు రాష్ట్రమే..తెలంగాణ రాష్టం కరీంనగర్ లో 1979 లో జన్మించింది. 2008 యూపీ క్యాడర్ కి చెందిన ఈమె అవినీతి పరుల పాలిట సింహ స్వప్నంగా పేరుగాంచింది. 1979 సెప్టెంబర్ 27 న జన్మించిన చంద్రకళ కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి బి ఏ పూర్తి చేసింది. బులన్ చార్ మేజిస్ట్రేట్ గా ఎంతో ఫేమస్ అయ్యింది. ఎవ్వరికి తల దించని అధికారిణిగా చంద్రకళకు మంచి పేరు ఉంది.
Image result for b. chandrakala
 • ఆమ్రపాలి :
  విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి 2010 బ్యాచ్ IAS అధికారిని. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరుగా పని చేస్తుంది ఈ తెలుగమ్మాయి. ఐ ఐ టి మద్రాస్ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకుంది. జమ్మూకాశ్మీర్ కు చెందిన IPS అధికారి శామీర్ శర్మను పెళ్లాడిన ఆమె విధి నిర్వహణలో ఎంతో ఖచ్చితమైన అధికారిగా పేరు తెచ్చుకుంది.
Image result for amrapali ias
Content above bottom navigation