Most Interesting Questions and Answers in Telugu

139

అసలు మన భూమి చుట్టూ ఉండే ఓజోన్ లేయర్ అంటే ఏమిటి..అది దేనితో తయారవుతుంది. ఓజోన్ లేయర్ కు రంద్రం పడింది అంటారు. అంటే ఏమిటి ?హాస్పిటల్ లో X rays ఎలా పనిచేస్తాయి. మన శరీరం లోపల ఉండే ఎముకలను అవి ఎలా ఫోటో తీయగలుగుతున్నాయి. మనం రోడ్ల మీద వెళ్లే వెహికల్స్ కు రకరకాల కలర్స్ లో నెంబర్ ప్లేట్స్ చూస్తాం కదా.. వాటికి అర్థం ఏమిటి? రోలర్ కోస్టర్ ఎలా పనిచేస్తుంది. ఆ ట్రైన్ పడిపోకుండా ఎలా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మనం రోడ్ల మీద వెళ్లే వెహికల్స్ కు రకరకాల కలర్స్ లో నెంబర్ ప్లేట్స్ చూస్తాం కదా.. వాటికి అర్థం ఏమిటి?

మన వెహికల్స్ కు రకరకాల కలర్స్ లలో నెంబర్ ప్లేట్స్ చూస్తాం. అయితే వాటి ఒక్కొక్క దానికి ఒక్కొక అర్థం ఉంటుంది. వాటి అర్థాలు ఏమిటంటే..
రెడ్ కలర్ నెంబర్ ప్లేట్.. మన దేశ రాష్ట్రపతికి, రాష్టాల గవర్నర్ల వెహికల్స్ కు మాత్రమే ఈ రెడ్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి.

  • బ్లూ నెంబర్ ప్లేట్.. ఇది ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, అంబాసిడర్ల కార్లకు మాత్రమే ఉంటుంది.
  • ఎల్లో కలర్ ప్లేట్.. ఎల్లో కలర్ లో నెంబర్ ప్లేట్ ఉందంటే..అవన్నీ కూడా కమర్షియల్ నెంబర్ ప్లేట్ అని అర్థం. ట్యాక్సీలు, క్యాబ్స్, పెద్ద పెద్ద లారీలు, ట్రక్స్, ఆటోలకు ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ .అంటే వ్యాపార పరంగా, డబ్బు సంపాదించుకోవడం కోసం నడిపేవి.
  • వైట్ కలర్ ప్లేట్… ఇది మనం ఎక్కువగా చూస్తుంటాం. కామన్ మ్యాన్స్ ఉపయోగించేవారికే ఉంటుంది. వైట్ కలర్ లో ఉండే వెహికల్స్ ను పర్సనల్ విషయాలను వాడుకోవాలి తప్ప, కమర్షియల్ గా వాడుకోకూడదు. అంటే రెంట్స్ కోసం యూజ్ చెయ్యకూడదు.
  • అప్వర్డ్స్ పాయింటింగ్ యారో.. ఒక్కొక్క నెంబర్ ప్లేట్ మీద ఒక బాణం గుర్తు పైకి చూపిస్తుంది. ఇలాంటి నెంబర్ ప్లేట్ కనిపిస్తే అది ఆర్మీకి సంబందించిన వెహికల్. మిలట్రీ వెహికల్స్ కు ఒక యూనిక్ నెంబర్ ప్లేట్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెంబర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఈ యారో కు పక్కన ఉండే టూ డిజిట్స్ అనేవి ఆ వెహికల్ ఏ ఇయర్ లో తయారుచేశారు అనేది చూపిస్తుంది.

ఇలా వెహికల్ కు ఉండే నెంబర్ ప్లేట్ ను బట్టి అది ఏ క్యాటగిరికి సంబంధించింది, ఎవరికీ సంబంధించింది అనేది తెలుసుకోవచ్చు. రోలర్ కోస్టర్ ఎలా పనిచేస్తుంది.
హారు ఫ్రెండ్స్‌! రోలర్‌ కోస్టర్లు తెలుసా. చాలా సినిమాల్లో… టీవీల్లో… పెద్ద పెద్ద పార్కుల్లో వీటిని చూస్తుంటాం కదా. వీటిని ఎక్కాలని మనకి అనిపిస్తుంటుంది. కానీ చూస్తుంటే భయం కూడా ఉంటుంది. ఇలాంటి కోస్టర్లు ఎలా పనిచేస్తాయి? అనే విషయానికి వస్తే… మనం చూసే కార్స్ కు, ట్రైన్స్ కు ఉన్నట్టు, రోలర్ కోస్టర్ కు ఉండే ట్రైన్ కు ఇంజర్ గానీ, స్టీరింగ్ గానీ ఉండదు. ఇది ఫిజిక్స్ ఫార్ములా మీద ఆధారపడి పనిచేస్తుంది. రోలర్ కోస్టర్ కు బాగా హైట్ గా ఉండే ఒక లిఫ్ట్ గిల్ ఉంటుంది. ఈ ట్రైన్ ను స్టార్ట్ చెయ్యడానికి ముందు ఈ ట్రైన్ ను ఒక చైన్ సహాయంతో లిఫ్ట్ గిల్ మీదకు తీసుకెళ్తారు. అలా దానిని పైకి తీసుకెళ్లినప్పుడు దానికి ఉండే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు ట్రైన్ ను ఒక్కసారిగా అక్కడి నుంచి వదలగానే, గ్రావిటీ కారణంగా ఆ ట్రైన్ కిందకు వస్తూ, గంటకు 110 కిమీ వేగానికి చేరుకుంటుంది. ఆ స్పీడ్ అనేది ఆ ట్రైన్ ఆ రైడ్ మొత్తం చెయ్యడానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. ట్రైన్ పైన ఉన్నప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అదే కిందకు పడుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ తగ్గి, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. దాని శక్తితో అది దాని ముందు ఉన్న మరొక ఎత్తైన భాగానికి చేరుకుంటుంది.

ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ తగ్గి, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇలా ఈ రెండు ఎనర్జీలు, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆధారంగా ఈ ట్రైన్ అనేది మొత్తం రైడ్ ను కంప్లీట్ చేస్తుంది. మరి ఆ ట్రైన్ అన్ని వంకర్లు తిరుగుతున్నా ఎందుకు పడిపోవడం లేదంటే… దానికి కారణం ఆ ట్రైన్ కు ఉండే వీల్ సిస్టమ్. మన నార్మల్ వెహికల్ కు ఉన్నట్టు, వీటికి ఒకవైపే వీల్స్ ఉండవు. పైన, కింద, ప్రక్కన..మూడు వైపులా వీల్స్ ఉంటాయి. పైన ఉండే వీల్స్ అనేవి ట్రైన్ ట్రాక్ మీద రైడ్ చెయ్యడానికి యూజ్ అవుతాయి. కింద ఉండే వీల్స్ ట్రైన్ కింద పడిపోకుండా చూస్తాయి. పక్కన ఉండే వీల్స్ ట్రైన్ పక్కకు వెళ్లకుండా ట్రాక్ మీద ఉండేలా చూస్తాయి. ఇక రైడ్ మొత్తం సేఫ్ గా జరిగేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రోలర్ కోస్టర్ కు కొన్ని వందల సెన్సార్లు ఉంటాయి. ఈ సెన్సార్లు ఎప్పటికప్పుడు రైడ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటె వెంటనే ట్రైన్ ను ఆపేస్తాయి. అలా వెంటనే ఆపడం కోసం మ్యాగ్నటిక్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి కేవలం 2.8 సెకండ్స్ లలో ట్రైన్ ను అవుతాయి.

2.ఓజోన్ లేయర్ అంటే ఏమిటి?

సూర్యుడి నుంచి అతి భయంకరమైన లేయర్స్ అనేవి మన భూమి మీదకు వస్తుంటాయి. అవి డైరెక్ట్ గా మన శరీరానికి తగిలితే చాలా ప్రమాదం. కానీ అవి మనకు డైరెక్ట్ గా తాకకుండా, మన భూమి చుట్టూ ఉండే ఒక పొర మనల్ని కాపాడుతుంది. అదే ఓజోన్ లేయర్. మన భూమికి సుమారుగా 35 కిమీ ఎత్తులో ఈ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఆక్సిజన్ సింబర్ O. అలాంటి మూడు ఆక్సిజన్ ఆటమ్స్ కలిసి ఒక ఓజోన్ లేయర్ గా ఏర్పడుతుంది. దీని సింబర్ O3. ఈ ఓజోన్ అనేది మన వాతావతావరణంలో చాలా అరుదుగా ఉంటుంది. గాలిలో ఉండే కోటి మాలిక్యుర్స్ లలో కేవలం 3 మాత్రమే ఉంటాయి. ఈ ఓజోన్ మాలిక్యుర్స్ తో ఏర్పడిన గ్యాస్ అనేది మన భూమి చుట్టూ, 3 నుంచి 5 మిల్లీమీటర్స్ మందంతో ఒక పొరలాగ ఏర్పడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం సూర్యుడి నుంచి రక్షించుకోడానికి, సన్ స్క్రీన్ ఎలా అప్లై చేసుకుంటామో, మన భూమికి ఈ ఓజోన్ అలా అన్నమాట. ఇది సూర్యుడి నుంచి వచ్చే 97 శాతం రేడియేషన్ ను ప్రమాదకర UV కిరణాలను ఈ లేయర్ అబ్సర్వ్ చేసుకుంటుంది. అయితే ఈ మధ్య ఓజోన్ లేయర్ కు చిల్లు పడింది అని వింటున్నాం. చిల్లు పడటం అంటే రంద్రం పడటం కాదు. కానీ ఓజోన్ లేయర్ మందం తగ్గుతుంది. మనం ఇళ్లలో వాడే ఫ్రిడ్జ్ ల నుంచి క్లోరోఫ్లోరో అనే యాసిడ్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ లలో కార్బన్, క్లోరిన్, ఫ్లోరిన్ అనే ఫిలమెంట్స్ ఉంటాయి. వీటికి UV రేస్ తగిలినప్పుడు దీని నుంచి క్లోరిన్ విడిపోతుంది. అలా విడిపోయిన క్లోరిన్ అనేది ఓజోన్ లోని ఆక్సిజన్ ఆటమ్స్ తో రియాక్ట్ అయ్యి, ఓజోన్ మాలిక్యూల్స్ ను విడగొడుతుంది. ఇలా ఒక్క క్లోరిన్ ఆటమ్ అనేది లక్షల ఓజోన్ మాలిక్యుర్స్ ను డిస్ట్రాయ్ చెయ్యగలడు. అలా మెల్లిమెల్లిగా ఓజోన్ మాలిక్యుర్స్ తగ్గిపోవడంతో ఆ ప్రాంతంలో ఓజోన్ లేయర్ మందం తగ్గిపోతుంది. అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలూ డైరెక్ట్ గా మనకు తాకితే మనకు చాలా ప్రమాదకరం.

  1. X ray లు ఎలా పనిచేస్తాయి..
    1895 లో బిలిహాన్ అనే సైంటిస్ట్ X ray ను కనిపెట్టాడు. ఒకసారి ఆయన గ్యాస్ డిశ్చార్జ్ ట్యూబ్స్ తో ఎలక్ట్రాన్స్ మీద పరిశోధన చేస్తున్నప్పుడు దీనిని ఆన్ చేసిన ప్రతీసారి, అదే రూమ్ లో దూరంగా ఉన్న క్లోరో స్క్రీన్ అనేది వెలగడం మొదలైంది. దీని నుంచి వచ్చే కిరణాల వల్లనే అది వెలుగుతుందని అర్థం అయ్యింది. అందుకే ఆ ట్యూబ్ చుట్టూ ఒక కార్బోర్డ్ ను అడ్డుగా పెట్టాడు. అయినా కానీ ఆ స్క్రీన్ వెలుగుతుంది. అంటే ఏవో రేస్ అనేవి ఈ కార్బోర్డ్ నుంచి ప్రయాణిస్తున్నాయని గమనించాడు. మనం మ్యాథ్స్ లో ఏదైనా వాల్యూ తెలియనప్పుడు దానిని X అనుకుంటాం కదా.. అలా వాటికి X రేస్ అనే పేరు పెట్టాడు. అనుకోకుండా అతని చేతిని ట్యూబ్ కు స్క్రీన్ కు మధ్యలో ఉంచినప్పుడు అతని చేతిలోని ఎముకల ఆకారం ఆ స్క్రీన్ మీద కనపడ్డప్పుడు, ఆ రేస్ వలన యూజ్ ఏంటనేది అర్థం అయ్యింది. అయితే ఈ X rays ఎలా పనిచేస్తాయంటే.. మనం ఎలక్ట్రో మ్యాగ్నటిక్ స్పెక్ట్రమ్ చూసినట్టు అయితే ఈ X rays అనేది వాటిలో ఒక భాగం. ఇది ఒకరకమైన ఎలక్రో మ్యాగ్నటిక్ రేడియేషన్. అయితే ఇది మనం చూసే లైట్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అలాగే ఎక్కువ ఎనర్జీతో పవర్ ఫుల్ గా ఉంటుంది. వీటికి వేవ్ లెంత్ ఎక్కువగా ఉండటం వలన మన బాడీ నుంచి కూడా ప్రయాణించగలవు. లైట్ అనేది ఏదైనా ఒక వస్తువుకు తగిలి ఆగిపోతుంది. కానీ X rays అనేవి వస్తువుల నుంచి పాస్ అయ్యి వెళ్లగలవు. ఆ వస్తువుల సాంద్రత ఎక్కువగా ఉంటె, ఈ X rays అనేవి మధ్యలోనే ఆగిపోతాయి. అదే సాంద్రత తక్కువగా ఉంటె, ఇవి ఆ వస్తువు గుండా బయటకు రాగలవు. మన శరీరంలో ఎముకలు కాల్షియంతో తయారుచెయ్యబడి, ఎక్కువ డెన్సిటీతో ఉంటాయి. అందుకే ఇవి X rays ను ఆపేస్తాయి. కానీ మన బాడీలోని కండరాలు, మిగిలిన అవయవాలు, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ వంటివి తక్కువ డెన్సిటీతో ఉంటాయి. కాబట్టి వీటి గుండా X rays పాస్ అయ్యి బయటకు వెళ్తాయి. ఒక వ్యక్తికి X rays తీసేటప్పుడు అతనికి ఒకవైపు రేడియో గ్రాఫిక్ ఫిల్మ్ ను ఏర్పాటు చేస్తారు. మరొకవైపు నుంచి X rays ను పంపుతారు. ఆ X rays లోని ప్రొటాన్స్ అనేవి మనిషి గుండా వెళ్లి మరొకవైపు ఉన్న ఫిల్మ్ మీద పడతాయి. ఆ ప్రొటాన్స్ పడిన చోట , రేడియో గ్రాఫిక్ ఫిల్మ్ మీద కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఏ ప్రాంతంలో X rays పడ్డాయో, ఆ ప్రాంతం నలుపు రంగులోకి మారుతుంది. ఏ ప్రాంతంలో X raysపడలేదో, ఆ ప్రాంతం తెల్లగా ఉంటుంది. మనం X rays ను గమనిస్తే ఎముకల భాగాల సాంద్రత ఎక్కువగా ఉండటం వలన X rays ను తమ గుండా పాస్ అవ్వనివ్వను. అందుకే ఆ ప్రాంతంలో తెల్లగా కనిపిస్తుంది. ఇలా X ray అనేది పనిచేస్తుంది. ఇది ఇప్పటి వైద్య శాస్త్రంలో ఎంతాగానమో ఉపయోగపడుతుంది.
Content above bottom navigation