కూతురి కోసం మగాడిలా మారిన తల్లి.. మనసు కరిగిస్తున్న మహిళ దీనగాథ!

సమాజం మొత్తం మగాడి మీదనే ఆధారపడి ఉంటుంది. అది అవునన్నా, కాదన్నా కూడా నిజం. ఏ ఇంటికి అయినా మగతోడు అనేది అవసరం. మగాడు ఉన్న ఇల్లు ఒకలా ఉంటె, మగాడు లేని ఇల్లు ఇంకోలా ఉంటుంది. పురుషాధిక్యం ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో ఒక మహిళ ఒంటరిగా బతకడం ఎంత కష్టమో మనం ఉహించుకోగలం. మగాడి తోడు లేకుండా పిల్లలతో ఒంటరి జీవితం సాగించాలంటే ఇంకెంత కష్టమో అర్థం చేసుకోండి. ముఖ్యంగా పాకిస్థాన్ వంటి దేశాల్లో మహిళ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. మగాళ్లతో కలిసి పనిచేయలేక, వేధింపులు తట్టుకోలేక చాలామంది మహిళ ఉద్యోగాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. అలాంటి స్థితిలో ఒక మహిళ తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే తప్పకుండా గుండె కరుగుతుంది.

Image result for కూతురి కోసం మగాడిలా మారిన తల్లి.. మనసు కరిగిస్తున్న మహిళ దీనగాథ!

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఫర్హీన్ అనే మహిళ తన తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. భర్త లేకపోవడంతో ఓ షాప్ నడుపుతోంది. అయితే మహిళ రూపంలో పనిచేస్తే వేధింపులు తప్పవని భావించి మగాడి అవతారంలోకి మారిపోయింది. జుట్టు కత్తిరించుకుని, ఫ్యాంటు షర్టులు వేసుకుని మగాడిలా సమాజంలోకి అడుగుపెట్టింది. ఆమె షాప్ కు వచ్చే వాళ్ళందరూ ఈమెను మగాడు అనే అనుకున్నారు. భయ్యా అది ఇవ్వు, ఇది ఇవ్వు అనేవాళ్ళు. అయితే ఆ షాప్ నుంచి వచ్చే ఆదాయం సరిపోక ఆమె ఒక్కోసారి క్యాబ్ నడుపుతోంది. అయితే ఫర్హీన్ దీనగాథను ‘హ్యూమన్స్ ఆఫ్ లాహరో’ అనే ఫేస్‌బుక్ పేజ్‌ పోస్ట్ చేసింది. ఈమె ఒక మహిళ. కానీ సమాజానికి భయపడి మగాడిలా మారింది. కన్న కూతురి భవిష్యత్ కోసం ఎంతాగానమో కష్టపడుతుంది అని ఆ పేజ్ లో పోస్ట్ చేశారు. ఇది చుసిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటివరకు అంతా ఆమెను మగాడు అనుకున్నారు. కానీ మహిళ అని తెలియడంతో షాక్ అయ్యారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ సందర్భంగా ఫర్హీన్ మాట్లాడుతూ.. ‘‘ఒంటరి మహిళగా స్వతంత్రంగా జీవించడం ఈ సమాజంలో చాలా కష్టం. ముఖ్యంగా ఒక ఆడబిడ్డతో కలిసి జీవించడమంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది. సమాజంలో ఒంటరి మహిళలను, వారి సంతానాన్ని చిన్నచూపు చూస్తారు. కేవలం పురుషులకు మాత్రమే బతికే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే, నా రూపాన్ని మగాడిలా మార్చుకున్న. నా కూతురికి అండగా ఉంటూ కుటుంబాన్ని నడుపుకుంటున్నాను. బయటకు వెళ్లి పనిచేయాలంటే నా దగ్గర ఇంతకంటే గొప్ప మార్గం ఏదీ కనిపించలేదు’’ అని పేర్కొంది. అయితే ఫర్హీన్ మగాడిలా జీవితం గడపడం ఎంతోమందిని కదిలించింది. తాను మగాడిని కాదని తెలిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆమె ఆందోళన పడింది. కానీ ఏ సమాజం కోసమైతే ఆమె భయాందోళనలు వ్యక్తం చేసిందో, అదే సమాజంలోని మంచి మనుషులు ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. రూ.2 లక్షలు విరాళాలు సేకరించి ఆమెకు అందించారు. ఫేస్‌బుక్ పేజీలో ఆమె కథ వైరల్ కావడంతో దేశవిదేశాల నుంచి కూడా పలువురు ఆమెకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని చాటుతున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation