హెల్మెట్‌లో పాము.. చూసుకోకుండా 11 కిమీలు ప్రయాణించిన టీచర్, చివరికి..

అందులో మీకు తెలియకుండా పాము లు కూడా ఉండొచ్చు. కేరళకు చెందిన ఓ ఉపాధ్యాయుడికి ఇలాంటి అనుభవమే ఏర్పడింది. అతడు పెట్టుకున్న హెల్మెట్‌లో విషపూరిత పాము ఉంది. కొంత దూరం ప్రయాణించే వరకు అతడు దాన్ని గుర్తుపట్టలేకపోయాడు.కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌లో పనిచేస్తున్న సంస్కృతం టీచర్ రంజీత్ ఫిబ్రవరి 5వ తేదీ ఉయం స్కూల్ ముగిసిన తర్వాత వేరొక స్కూల్‌కు బైకు మీద బయల్దేరాడు. అక్కడికి చేరుకున్న తర్వాత హెల్మెట్ తీస్తుండగా.. లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో దాన్ని పరిశీలనగా చూసి షాకయ్యాడు. అతడి హెల్మెట్ ఉన్న పామును చూసి అతడికి ప్రాణం పోయినంత పనైంది.చివరికి.. బతికిపోయాడు.

అదృష్టంకొద్ది ఆ పాము చనిపోయి ఉంది. అయితే, అది అతడు హెల్మెట్ పెట్టుకున్న తర్వాత చనిపోయిందా లేదా, ఎవరైనా చనిపోయిన పామును హెల్మెట్‌లో పెట్టారనేది తెలియరాలేదు. అది అతడిని కాటేసి ఉంటుందనే భయంతో స్నేహితులు హుటాహుటిన హాస్పిటల్‌లో చేర్చారు. వైద్యపరీక్షల్లో పాము కాటు వేయలేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

ఈ సందర్భంగా రంజీత్ మాట్లాడుతూ.. ‘‘ఆ పాము నా హెల్మెట్‌లోకి ఎప్పుడు దూరిందో తెలీదు. చిన్న పాము కావడం వల్ల అది లోపల ఉన్న సంగతే తెలియలేదు. మా ఇంటికి దగ్గర ఒక చెరువు ఉంది. ఆ పాము అక్కడి నుంచే హెల్మెట్‌లోకి వెళ్లి ఉంటుంది’’ అని తెలిపాడు. చచ్చినపామును ఎవరైనా హెల్మెట్లో పెట్టారేమోనని అనుమానం వచ్చినా దానిపై రంజిత్ కు, అతని స్నేహితులకు ఎలాంటి స్పష్టత లేదు. చూశారుగా.. ఇకపై హెల్మెట్లు పెట్టుకొనేప్పుడు, షూలు ధరించేప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇలా షూలలో కూడా పాములు దూరుతున్నాయి.. ఇలా క‌రిచిన ఘ‌ట‌న‌లు కూడా గ‌తంలో ఉన్నాయి,
అందుకే ఇలాంటి విష‌యాల‌లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. లేక‌పోతే అస‌లుకే ప్ర‌మాదం వ‌స్తుంది, ఇక హెల్మెట్ల‌ను తోట‌లు పొలాల ద‌గ్గ‌ర పెట్టిన స‌మ‌యంలో క‌చ్చితంగా చెక్ చేసి త‌ల‌కి ధ‌రించాలి, లేక‌పోతే పాములు అందులోకి వెళ్లే ప్ర‌మాదం ఉంటుంది, అలాగే ఇంట్లో కూడా వాటిని తీసుకునే స‌మ‌యంలో జెర్రీ తేలు లాంటివి కూడా ఉంటాయి చూసుకోని త‌ల‌కి ధ‌రించండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation