నాగుపాము తలలో ఉండే నాగమణి గురించి ఆసక్తికర విషయాలు..

1608

నాగమణి.. ఎన్నో శతాబ్దాలుగా మనిషిని ఆకర్షిస్తున్న విలువ కట్టలేని వజ్రం. అత్యంత పవిత్రమైన రత్నాల్లో నాగమణి ఒకటి. వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే.. పాము కాటు వేయడానికి కూడా రాదని, అలాగే ధనవంతులు అవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు.. మంత్ర శక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. నాగమణి గురించి తెలుసుకోవాలంటే.. నాగినీల గురించి కూడా తెలుసుకోవాలి. నాగినీల గురించి అందరూ వినే ఉంటారు. చాలా సినిమాలు, సీరియల్స్ నాగినీలపై చాలా కథలు వచ్చాయి. అయితే నిజంగానే నాగినీలు ఉంటాయా.. విషం చిమ్మే నాగుపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది ? దీనివెనక ఉన్న రహస్యం ఏంటి ? పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా ? లేదా నాగపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా ? ఇంతటి శక్తివంతమైన నాగమణిలు దొరుకుతాయా ? అసలు, నాగినీలు, నాగమణిలు ఈ కాలంలో కూడా ఉంటాయా ? నాగినీలు, నాగమణిల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Image result for నాగుపాము తలలో ఉండే నాగమణి గురించి ఆసక్తికర విషయాలు..

నాగ అంటే మగ, నాగినీ అంటే ఆడ అని అర్థం. నాగ, నాగినిలు.. తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి. అంటే విషపూరితమైన పాము.. ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది. ఎక్కువగా..ఇవి మనుషుల రూపంలోకే మారతాయి. హిందూపురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండే దాన్ని మణి అని పిలుస్తారు. ఇది వజ్రం కంటే విలువైనది. తొమ్మిది పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి. ఇది ఎలా రూపొందుతుంది అనేది.. చాలా పుస్తకాల్లో వివరించారు. స్వాతి నక్షత్రం రోజు.. వర్షం పడినప్పుడు.. ఆ వర్షపు బిందువు నాగు పాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట. ఇతిహాసాల ప్రకారం.. మణి కేవలం నాగు పాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే.. నాగుపాము మాత్రమే వంద ఏళ్లు భూమ్మీద ఉండగలుగుతుంది. ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే.. ఆ పాము అద్భుతమైన శక్తిసామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే.. ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది. అంటే మనిషి రూపంలోకి మారగలదు. చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలిరంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగ మణి మన దగ్గర ఉండటం.. అదృష్టంగా భావిస్తారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరిసంపదలు పొందగలుగుతాడట. ఎప్పుడైతే.. మణిని పాము నుంచి తొలగిస్తారో.. అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ నాగమణి గురించి.. వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలు ఉంటాయి. అతల, వితల, సుతల, తలాలల, మహాతల, రసాతల, పాతాల అనే పేర్లతో.. ఏడు భూగర్భాలుంటాయి. థైత్య, ధానవులు భూగర్భంలో జీవిస్తారు. విష్ణువు కూడా భూగర్భంలోనే శేషనాగ రూపంలో ఉంటాడు. శేషనాగు భూమిని తన తలపై మోస్తూ ఉంటుంది. వాయు పురాణం ప్రకారం పాములు, రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు. అతల లోకాన్ని నాముచి రాక్షసులు,. సుతల లోకాన్ని మహాజంభ రాక్షసులు, వితల లోకాన్ని ప్రహల్లాద రాక్షసుడు, గభస్తల లోకాన్ని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు. మహాతల లోకాన్ని విరోచన్ రాక్షసుడు, ష్రీతల లోకాన్ని కెసరీ రాక్షసుడు పాలిస్తాడు. పాతాల లోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు. నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతాయి. అయితే ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు, తేనె, లేత ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయట. అలాగే నాగమణి చిన్న వడ్ల గింజలాగా ఉంటుందని కొందరు అంటే, ముత్యం అంతా ఉంటుందని కొందరు అంటారు. చరిత్రలో ఎక్కడా నాగమణి ఉన్నట్టు.. అది ఎవరికో ఒకరికి దొరికినట్టు చిన్న ఆధారం కూడా లేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation