ఇండియన్ రైతును ప్రేమించిన రష్యన్ పార్లమెంట్ ఉద్యోగిని.. ఈ ఇద్దరి ప్రేమకథ తెలిస్తే ఫిదా అవుతారు..

ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం అనే బేధాలు ఉండవు. దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటారు ప్రేమికులు. ఇవన్నీ వినడానికి సినిమా డైలాగుల్లా అనిపించొచ్చు.. కానీ అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ కొన్ని ఘటనలు ఇలా జరుగుతుంటాయి. ఇప్పటివరకు ఎంతో మంది విదేశీయులను పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. ఇప్పుడు అలాంటి మరొక జంట గురించే మీకు చెప్పబోతున్నాను.. అయితే ఈ ప్రేమ జంటకు ఒక స్పెషాలిటీ ఉంది.. ఇందులో భారతీయుడు అయినా ప్రేమికుడు ఒక రైతు, రష్యన్ కు చెందిన ప్రేమికురాలు రష్యన్ పార్లమెంట్ లో ఉద్యోగిని.. మరి ఈ ఇద్దరికీ ఎలా కుదిరింది..ఎలా ప్రేమించుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

నరేంద్ర…మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న వ్యక్తి. ఉన్న ఊర్లో పనిలేకపోవడంతో, పొట్టచేత పట్టుకొని పనికోసం గోవా వెళ్లాడు. అక్కడ బార్ లో బేరర్ గా పనికి కుదిరాడు. గోవా కాబట్టి బార్ లకు అమ్మాయిలు, మహిళలు రావడం కామన్. ఎప్పటిలాగే తన పనిలో తాను ఉండగా, రష్యన్ కు చెందిన ఆనస్తత అనే అమ్మాయి అతడిని పిలిచి ఓ బీర్ ఆర్డర్ ఇచ్చింది. బీర్ తెచ్చి, గ్లాస్ లో పోసి ఆమెకు అందించాడు నరేంద్ర. ఏమైందో ఏమో కానీ ఆ క్షణం నుండి నరేంద్రను ఇష్టపడడం స్టార్ట్ చేసింది ఆ రష్యన్ అమ్మాయి. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కలిసి గోవాలోని పార్క్ లు, బీచ్ లు తిరిగేశారు. అప్పటికే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. తర్వాత తెల్సిన విషయం ఏమిటంటే.. ఆనస్తత రష్యన్ పార్లమెంట్ హౌజ్ లో ఎకానమిక్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగిని అంట. తన ప్రేయసిని చూడడానికి నరేంద్ర రెండు సార్లు రష్యాలోని మాస్కో కు కూడా వెళ్లొచ్చాడట. ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో ఆనస్తత ఇండియాకు వచ్చి మరీ నరేంద్ర ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యను తన ఊరికి తీసుకొచ్చిన నరేంద్ర ను చూసి ఊరోళంతా షాక్ అయ్యారంట. అక్షరం ముక్క రానీ నరేంద్రను అంత పెద్ద చదువులు చదివిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఏంటి? అని ఊరంతా నోరెళ్లబెట్టారంట. ఈ పెళ్లి మూడునాళ్ల ముచ్చటే అని చాలా మంది అనుకున్నారంట. కానీ రెండేళ్లైనా వీరి బంధం మాత్రం రోజురోజుకు బలపడుతుందే కానీ ఏ మాత్రం తగ్గట్లేదు.

ఇలా ఒక సాధారణ రైతు అయినా వ్యక్తి ఏకంగా రష్యాలో పార్లమెంట్ లో జాబ్ చేసే అమ్మాయిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. నరేంద్ర రష్యాలో పూర్తిస్థాయిలో సెట్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.. దేశ సరిహద్దులు దాటిన ఈ ఇద్దరి ప్రేమకు మనం కూడా అభినందనలు తెలుపుదాం..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation