మరో సంచలన నిర్ణయం.. జూన్ 1 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కరోనా వైరస్ ప్రభావం కారణంగా జూన్ 1వ తేదీ వరకూ దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మే 4వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ విధించిన సింగపూర్.. తాజాగా రెండోసారి కూడా లాక్‌డౌన్‌పై తన నిర్ణయాన్ని మార్చుకుంది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

56 లక్షల జనాభా కలిగి ఉన్న సింగపూర్‌లో ప్రస్తుతం 9125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 11 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. ఇక అక్కడ ఉంటున్న అనేకమంది వలస కూలీల్లో అంటువ్యాధులు ప్రభలడంతో సింగపూర్ ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా తీవ్రత మొదటి దశలో ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ విధించి ప్రపంచదేశాల చూపును తన వైపుకు తిప్పుకున్న సింగపూర్.. వైరస్‌ను నియంత్రించేందుకు తగిన చర్యలను తీసుకుంటోంది. మరోవైపు అక్కడ మూడో వంతు వరకు బంగ్లాదేశ్ కార్మికులకే ఎక్కువగా అంటువ్యాధులు సోకినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ఇక లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఆ దేశ ప్రధానమంత్రి లీ హీన్ లూంగ్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, ప్రజా రవాణా, థియేటర్లు, మాల్స్ అన్నీ కూడా జూన్ 1 వరకూ మూసి ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని కోరుకుంటున్నాను. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటివి జీవితంలో భాగంగా చేసుకోండి అని ఆయన అన్నారు.

Content above bottom navigation