ఏపీలో మరిన్ని సడలింపులు.. జూన్ 8 నుంచి జగన్ సంచలన నిర్ణయం

97

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా పలు నిబంధనలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

నయా రూల్స్ ఇవే…

ప్రార్ధనా మందిరాలు, ఆలయాల్లో రద్దీ కాకుండా ఉండేలా భక్తులు వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి.
అనుమతి పొందిన ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై నిషేధం
ప్రవేశ మార్గాల దగ్గర ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉండాలి.


ప్రార్థన మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్లోకి వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
దేవాలయాల్లో క్యూ పద్దతి సవ్యంగా ఉంచాలి. క్యూలైన్లలో 6 అడుగుల భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి.
తీర్ధ ప్రసాదాలు, పవిత్ర జలాలను చల్లడం, విగ్రహాలు, పవిత్ర గ్రంధాలను తాకడం, భక్తి గీతాలను ఆలపించడం నిషేధం.


హోటళ్లు, రెస్టారెంట్లలో పని చేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, మాస్క్ ధరించాలి. అదేవిధంగా సీట్లు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
మాల్స్లో అన్ని చోట్ల హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి.

Content above bottom navigation