SBI అకౌంట్ వాడుతున్నారా.? 6 కొత్త రూల్స్ ఇవే

96

దేశంలో ఈ వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఓ వైపు భారీ ప్రాణనష్టం జరుగుతుంటే మరోవైపు ఆర్థిక మాంద్యం ఉద్యోగులను, సామాన్యులను చిక్కుల్లో పడేస్తుంది. అయితే ప్రతి వ్యక్తికి బ్యాంకుకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, చిన్న చిన్న పనులు ప్రతినెలా దాదాపు అందరికీ ఉంటాయి. బ్యాంకు ఏ రోజుల్లో పని చేస్తుందో, బ్యాంక్ సెలవులు (Bank Holidays) ఎప్పుడో తెలుసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

జూన్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా బ్యాంకులకు ఏ సెలవులు లేవు. కేవలం ఆదివారం, రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంది. ఆదివారాలు 7, 14, 21, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అదే విధంగా రెండో శనివారం 13, నాలుగో శనివారం 27 తేదీలలో జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు.

ఏటీఎం కేంద్రంగా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కస్టమర్లను ఎస్బీఐ పదేపదే అప్రమత్తం చేస్తోంది. ఈ జాగ్రత్తలు మీకోసం, మీరు ఎట్టి పరిస్దితుల్లో మీ ఏటీఎం పిన్ ఎవరికి చెప్పకండి, అలాగే మీ పిన్ నెంబర్ మీ ఆధార్ రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ల చివరి నెంబర్లు పెట్టుకోకండి, మీ డేట్ ఆఫ్ బర్త్ గా కూడా నెంబర్ పెట్టకండి.

ఇక పిన్ నెంబర్ కార్డు దగ్గర వాలెట్ లో ఎక్కడా రాసి పెట్టకండి , పిన్ ఏటీఎంలో ఎంటర్ చేసే సమయంలో ఎవరికి కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టండి. మీరు నగదు తీసిన తర్వాత ట్రాన్షక్షన్ బిల్లులు తీసుకెళ్లండి, ఎస్బీఐ మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ వివరాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. డబ్బులు డ్రా చేసే సమయంలో మీరు మాత్రమే ఉండండి, ఎవరిని రానివ్వకండి.

Content above bottom navigation