బ్రేకింగ్ అయేషా మీరా హత్య కేసు.. వెలుగులోకి మరో నిజం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తల ఎముకపై బలమైన గాయమున్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తాజా నివేదికలో బయటపడింది. ఆయేషా మీరా హత్య కేసుపై సీబీఐ పునర్విచారణ చేసింది. .. ఇటీవల మరోసారి ఆమె మృతదేహానికి పోస్ట్‌‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ స‌మయంలో సీఎఫ్ఎస్ఎల్ తమ నివేదికను సీబీఐకు అందజేసింది..ఈ నివేదికలో చనిపోయిన సమయంలో ఆయేషా వయసు 19 సంవత్సరాలని వెల్లడించారు. తల భాగంలోని ఉన్న ఎముకకు గాయమైనట్లు పేర్కొన్నారు. ఎముకలో ఉన్న షార్ప్ ఏడ్జ్‌లో బలంగా గాయమైనట్లు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. అస‌లు ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు చూస్తే..

Image result for ayesha meera

27 డిసెంబరు 2007 న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 19 ఏళ్ళ ఆయేషా మీరాని అతి దారుణంగా చంపేశారు,. అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆమెను హాస్టల్‌లోనే దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు అనే వార్త దేశంలో సంచ‌ల‌నం అయింది. త‌ర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు. ఈ కేసుని . పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా వినిపించడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ, తర్వాత సత్యంబాబు అనే యువకుడిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.. దాదాపు పదేళ్ల తర్వాత అతడు నిర్ధోషి అని తేలడంతో విడుదలయ్యాడు… దీంతో ఈ కేసును తిరిగి సీబీఐకి అప్పగించారు…. ఈ కేసులో అస‌లైన నిందితులు ఎవ‌రు అనేది తేల్చాలి అని స‌మాజం కోరుతోంది … దాదాపు 13 సంవ‌త్స‌రాలు అయింది అయినా ఈ దారుణానికి పాల్ప‌డిన వారు ఎవ‌రో తెలియ‌డం లేదు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation