అత్తవారింట అడుగు పెట్టిన నవ వధువు.. మొదటి రాత్రే అందరికీ షాక్ .. ఏం జరిగిందంటే.

114

ఏ యువతీ అయినా పెళ్లయిన తర్వాత అత్తవారింట్లో అడుగుపెట్టి వివాహ జీవితాన్ని గడపాలి అనుకుంటుంది. అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది అనుకుంటుంది. కానీ ఇక్కడో యువతి మాత్రం పెళ్లయి అత్తారింటిలో అడుగు పెట్టిన మొదటి రోజే తన పాడు బుద్ధి చూపించింది . పెళ్లి పూర్తి చేసుకుని నవవధువు గా ఇంట్లోకి వచ్చిన యువతీ కాస్త తెల్లారేసరికి వరుడు కుటుంబ సభ్యులందరికీ భారీ షాక్ ఇచ్చింది. దీంతో వారి కుటుంబ సభ్యులు అందరూ ఒకింత ఆశ్చర్యానికి ఒకింత షాక్ కి గురయ్యారు. ఇక చేసేదేమీ లేక ఆ యువతి చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసింది అనుకుంటున్నారా… అది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

Image result for indian marriages

ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లా చోటపర గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నవ వదువుగా అత్తారింట్లో అడుగు పెట్టింది ఓ యువతి. రాత్రి విందులో వడ్డించే వంటకాల్లో మత్తుపదార్థాలు కలిపింది. ఇక కుటుంబ సభ్యులందరూ మత్తులోకి జారుకుంటున్నకా నగలు డబ్బు తో ఉడాయించింది ఈ నవవధువు. మత్తు పదార్థం ఎక్కువగా కలపడంతో మరుసటి రోజు ఉదయాన్నే మత్తులో నుంచి బయటపడ్డ కుటుంబ సభ్యులు.. ఇంట్లో వధువు కనిపించకపోవడంతో పాటు.. డబ్బు నగలు కూడా మాయం కావడంతో ఇదంతా ఆమె పని అని నిర్ధారించుకొన్నాడు. దీంతో వెంటనే జరిగిన ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు ఆ కుటుంబ సభ్యులు.

ఈ క్రింది వీడియో చూడండి

దీంతో వెంటనే పోలీసులు వరుడు కుటుంబ సభ్యులకు సంబంధం కుదిర్చిన టింకు అనే వ్యక్తి కోసం ఆరా తీయగా అతను కూడా పరారైనట్లు తెలిసింది. దీంతో వరుడు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన పెళ్లి కోసం ఏకంగా నాలుగు లక్షలు ఖర్చు చేశామని. గ్రాండ్ గా పెళ్లి జరిపించామని.. ఈ సంబంధం తెచ్చినందుకు గాను మధ్యవర్తికి కూడా డబ్బులు ఖర్చు పెట్టామని వరుడు ప్రవీణ్ తెలిపారు . అమ్మాయి తల్లిదండ్రులు కూడా పేదలవారు కావడంతో వధువుకు నగలు చేయించేందుకు తమ వద్దే డబ్బులు తీసుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం జరిగిన ఘటనతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తమ కుటుంబ పరువు మొత్తం పోయింది అని.. ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని వరుడు ప్రవీణ్ తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation