పెళ్లి చేసుకుంది .. వరుడికి షాక్ ఇచ్చి తెల్లారే ప్రియుడితో పరారైంది

115

పెద్దల సమక్షంలో ఒక వధూవరుల జంట పెళ్లి జరిగింది. తన జీవితంలోకి అడుగుపెట్టిన వధువు గురించి ఎన్నో కలలుగన్న వరుడికి తెల్లారేసరికి షాక్ ఇచ్చింది వధువు. ప్రియుడితో జంప్ అయిన వధువు అతడ్ని పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది. బలవంతంగా పెళ్లి చేశారు, నాకు పెళ్లి వద్దు, ఆ పెళ్లి కొడుకు వద్దు అని తెగేసి చెప్పింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా చిన్నమ సముద్రానికి నవవధువు పెళ్లయిన తెల్లారి ప్రియుడితో పారిపోయింది. ఊహించని ఈ ఘటనతో పెళ్ళికొడుకు షాక్ తిన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే సేలం జిల్లా చిన్నమ సముద్రానికి చెందిన పూమారై కూతురు సత్యకు, సెంగవల్లి నడువలూరుకు చెందిన పెరియ స్వామి కుమారుడు రవి కుమార్ కు నాలుగవ తేదీన వివాహం జరిగింది. పెళ్లయిన మరుసటిరోజే ఇంటి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లిన సత్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు చెందినవారంతా చుట్టుపక్కల వెతికారు. అయినా పెళ్లి కూతురు జడ కనిపించలేదు.

పెళ్లి కుమార్తె సత్య తల్లిదండ్రులు సెంగవల్లి పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.ఇక అత్తగారింటి నుండి పరారైన సత్య చిన్నమ సముద్రానికి చెందిన వల్లరసు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇక తమకు తమ తల్లిదండ్రుల నుండి, అత్త గారి కుటుంబం నుండి రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించిన సత్య,తనకు బలవంతంగా పెళ్లి చేశారని ఫిర్యాదు చేసింది. ఇక తాను,వల్లరసు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అని, తమ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోగా బలవంతంగా తనకు పెళ్లి చేశారని, అందుకే తాను ఇంటి నుంచి పారిపోయి వల్లరసును పెళ్లి చేసుకున్నానని వధువు సత్య చెప్పింది.

ఇక పోలీసుల సమాచారంతో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఇరు కుటుంబాలు వధువు చెప్పిన విషయాలు విని లబోదిబోమన్నారు. ముఖ్యంగా వరుడు ఖంగుతిన్నాడు.ఇక వధువు మాత్రం పెళ్లి కోసం వరుడు కుటుంబం తనకు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చేసింది. అంతేకాదు పెళ్లికైన ఖర్చులు కూడా తిరిగి ఇవ్వాలని వరుడి కుటుంబం కోరడంతో అవి కూడా ఇచ్చేస్తామని వధువు సత్య, ప్రియుడు వల్లరసు పోలీసుల ముందు అంగీకరించారు.

అయితే ఈ విషయంలో వధువు చాలా క్లారిటీతో తన జీవితాన్ని నిర్ణయించుకోగా, బలవంతంగా పెళ్లి చేసి వధువు తల్లిదండ్రులు చివరకు అభాసు పాలయ్యారు. వరుడి కుటుంబం జరిగిన సంఘటనతో ఆవేదనకు గురైంది. వరుడు మాత్రం అందరికంటే పెద్ద బకరా అయ్యాడు. పాపం పెళ్ళికొడుకు అని ఈ సంఘటన తెలిసిన స్థానికులంతా గుసగుసలాడుతుంటే , వధువు మాత్రం తాను ప్రేమించిన వాడితో చెట్టాపట్టాలు వేసుకొని వెళ్ళిపోయింది.

Content above bottom navigation