తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏపీలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్,అసోం, మధ్య మహారాష్ట్ర, గోవా, కొంకణ్, తూర్పు ఉత్తరప్రదేశ్, మరఠ్వాడ, జార్ఖండ్, బీహార్, మేఘాలయ, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

Image result for heavy rains

జార్ఖండ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమిళనాడు, మాల్దీవులు, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. మరోవైపు గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మబ్బులు వేసుకొని ఉన్నాయి. తెలంగాణలోని నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం మార్కెట్లో ఉన్న మిర్చి పంట వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమ, మంగళవారాల్లో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరం ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు పడతాయని.. అందువల్ల ఎవరు నిర్జన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండరాదని ఎత్తైన చెట్ల, ఎత్తైన ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే వాతావరణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు, డెంగీ విజృంభిస్తోందని రానున్న రోజుల్లో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో నీటిని నిల్వ చేసుకోవద్దని, దోమలు రాకుండా దోమ తెరలు వాడాలని సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో గాలులు వీస్తాయని ప్రజలు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation