అమ్మాయిలు నైట్ డ్యూటీ లకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే.?

2547

ఉద్యోగానికి వెళ్లేవారు చాలామంది షిఫ్టులు వైజ్ గా ఉద్యోగం చేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఎప్పుడు ఓకే షిఫ్టుల్లో పని చేస్తుంటే కొంతమంది మాత్రం ప్రతిరోజు వేరే వేరే షిఫ్టులు వెళ్లాల్సి ఉంటుంది. వారానికి ఒక షిఫ్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు కంపెనీ యాజమాన్యం. అయితే షిఫ్ట్ లలో డ్యూటీలు చేయడం ద్వారా ఎంతో సమయం మిగులుతుందని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ వెళ్లిన వాళ్ళందరూ.. పగలంతా తమకు ఎంతో కాళీ టైం దొరుకుతుంది అని ఏదైనా పని చేసుకోవచ్చు అని అనుకుంటారు. ప్రస్తుతం నైట్ షిఫ్ట్ లు చేస్తున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. అమ్మాయిలు కూడా నైట్ షిప్ట్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా షిఫ్ట్ ల కంటే నైట్ షిఫ్ట్ లు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు నేటితరం జనాలు.

Image result for night duty girls

అయితే తరచూ నైట్ డ్యూటీలు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నప్పటికీ నైట్ డ్యూటీల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే రాత్రివేళ డ్యూటీ లో నిర్వహించే వారితోపాటు వారానికొకసారైనా షిఫ్టుల్లో పని చేసేవారిలో జీవన గడియారం గాడి తప్పి గుండె సమస్యలు, డయాబెటిస్ వంటివి దాడి చేసే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి నిద్రలేమి కారణంగా, జీవన గడియారం గాడి తప్పుతుంది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ఫలితంగా జీవక్రియలు మందగిస్తాయి అని పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా బిపి షుగర్ భారీగా పెరిగిపోతుండడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది అంటూ ఈ అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే, మరెన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

నైట్ డ్యూటీలు వెళ్లే వారు సరైన నిద్ర తో పాటు ఆహార నియమాలు సరిగా పాటించడం.. ప్రతిరోజూ తగిన వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నైట్ షిప్ట్ చేసే నర్సుల్లో 9 శాతం మందిలో ఈ మెటాబాలిక్ సిండ్రోమ్ సమస్య అధికంగా ఉన్నట్టు తమ అధ్యయనంలో గుర్తించినట్టు తెలిపారు. డే షిప్ట్ నర్సులతో పోలిస్తే వారిలో 1.8 శాతం మాత్రమే ఉందని అన్నారు. ఇతర అధ్యయనాలను పరిశీలిస్తే.. ఏళ్ల తరబడి నైట్ షిప్ట్ చేసేవారిలో నెమ్మదిగా హెల్త్ రిస్క్ పెరిగిపోతున్నట్టు తమ పరిశోధనలో తేలిందన్నారు. రోజుకు 24 గంటలు.. ప్రతిఒక్కరూ రోజులో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. పగలు సమయంలో ఎక్కువ సేపు నిద్రపోయినా దాని ప్రభావం పెద్దగా ఉండదని, రాత్రి వేళల్లో నిద్రపోతేనే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలసటను నివారించేందుకు రోజులో 20 నుంచి 120 నిమిషాలు అదనంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. జనరల్ షిఫ్ట్ చేసేవారంతా సూర్యుని కాంతి పడటంతో ఆ రోజుంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారని, అదే నైట్ షిప్ట్ చేసేవారిలో అది లభించకపోవడంతో లేచినదగ్గర నుంచి నిరూత్సహాంగా అలసటగా కనిపిస్తారని తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation