నిర్భయ దోషుల అవయవదానం ఎవరికి ఇస్తునారో తెలుసా

189

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయం అన్నది ఎన్నో రోజులుగా సస్పెన్స్ చిత్రాన్ని తలపిస్తున్న విషయం తెలిసిందే. దోషులు న్యాయపరంగా ఉన్న అవకాశాలను వాడుకోవడంలో.. లాజిక్గా వ్యవహరిస్తూ.. ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా.. తనకు వేసిన ఉరిశిక్షను.. యావజ్జీవంగా మార్చాలంటూ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. అంతేకాదు.. పవన్ గుప్తా అభ్యర్థనపైన, ఇతనికి విధించిన శిక్ష పైన తిరిగి సమీక్ధించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొంది.

Image result for నిర్భయ దోషుల

మరోవైపు తమకు విధించిన డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని పటియాలా కోర్టులో మరో దోషి అక్షయ్ పిటిషన్ వేశాడు. అయితే స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రేపు ఉదయం 6.00 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. నలుగురు దోషులను రేపు ఉదయం తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు.ఈ సమయంలో నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులుగా ఉన్న నలుగురి అవయవాలను దానం చేయాలంటూ వేసిన ఓ పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తిని చంపడం వల్ల.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుందని, అవయవ దానం కోసం దోషులను ముక్కలుగా చేయడం సరికాదు అని, వారి పట్ల మానవ కనికరం కలిగి ఉండాలని, అవయవ దానం అనేది స్వచ్ఛందంగా జరగాలని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషులకు అవయవాలు దానం చేసే వీలు కల్పించాలని మాజీ న్యాయమూర్తి ఎంఎఫ్ సల్దానా తన పిటిషన్లో కోరారు. నిందితుడు పవన్ గుప్తా పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను కూడా సుప్రీం కొట్టిపారేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ముఖేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మల క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించింది. అయితే క్షమాభిక్ష పిటిషన్ను మరో నిందితుడు అక్షయ్కుమార్ ఇంకా ఛాలెంజ్ చేయలేదు. అయితే వీరి నలుగురుని రేపు ఉదయం ఆరుగంటలకు తీహర్ జైల్లో ఉరితీయనున్నారు.ఈ నిర్భయ కేసులో, 2012, డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్లో ఆరుగుర్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు రామ్ సింగ్.. జైలు సెల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో టీనేజ్ యువకుడు మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు. చివరకు మరికొన్ని గంటల్లో వీరికి ఉరిశిక్ష పడనుంది…పాటియాల కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు, ప్రజా సంఘాలనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation