క్వారంటైన్ నుంచి జమాత్ కార్యకర్తల పరారీ..

162

ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తబ్లిక్ జమాత్ కార్యకర్తల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ తేలడంతో అక్కడికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. పరీక్షలు జరిపిన తర్వాత పాజిటివ్ తేలితే ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు. కానీ చాలా మంది తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు దీనికి సహకరించడం లేదు. డాక్టర్లు,వైద్య సిబ్బందిపై దాడులు, అనుచిత ప్రవర్తన, పారిపోయేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంకా చాలా మంది జమాత్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచి వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నారు.

తమన్నా చీరలో మొత్తం చూపించేసింది ఆసలు తట్టుకోలేరు

Karnataka news: No coronavirus emergency declared in state ...

తాజాగా ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మర్కజ్ మసీదులో జరిగిన సమావేశానికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించి అక్కడి అధికారులు కాశీపూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. అక్కడ క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఇద్దరు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఆస్పత్రి నుంచి పారిపోయారు. వైద్య సిబ్బంది కళ్లుగప్పి కిటికీ అద్దాలు పగలగొట్టి మరీ తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఇది జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

ఇద్దరు తప్పించుకున్న విషయం తెలిసి స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమాత్‌కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేసుకోవాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల యూపీలోనూ కొంత మంది మర్కజ్ వెళ్లి వచ్చిన వారు అర్థనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించారు. ఈ విషయం తెలిసి అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

Content above bottom navigation