ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 160కిపైగా దేశాల్లో వైరస్ విస్తరించింది.
ముఖ్యంగా యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 2,18,631 దాటింది.మృతుల సంఖ్య 8,809 దాటింది.ఇటలీలో దారుణంగా అక్కడ జనం పరిస్థితి ఉంది.
స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లోనూ ఇదే పరిస్దితి ఉంది.ఇక భారత్ లో కూడా ఇది మరింత పెరుగుతోంది.
సుమారు 185 మందికి భారత్ లో కరోనా వైరస్ సోకింది.ఇప్పటికే ముగ్గురు మరణించారు.తాజాగా ఎగ్జామ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి సెంట్రల్ బోర్డులు మరి ఆ విషయాలు చూద్దాం.కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షలను ఆయా బోర్డులు వాయిదా వేశాయి. గురువారం నుంచి జరగాల్సిన సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం సీబీఎస్ఈ పరీక్షలు మార్చి 19 నుంచి 31 వ తేదీ వరకు జరగాల్సి ఉంది. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది మార్చి 31 తర్వాత ప్రకటిస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్దులు నేటి నుంచి పరీక్ష రాయక్కర్లేదు అని తెలిపారు, బయటకు కూడా విద్యార్దులు తిరగద్దు అని చెబుతున్నారు.

ఐసీఎస్ఈ, ఐఎస్సీ 10, 12 వ తరగతి పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే.. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. కరోనా దృష్ట్యా ఈ నెల 31 వరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాయిదాపడ్డ పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య185 కి చేరింది. దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంటే ఈ వైరస్ బారి నుంచి బయటపడొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ క్రింది వీడియో చూడండి
విద్యార్దులు కంగారు పడవద్దని పరీక్షలు జరుగుతాయి అని ఇలా వాయిదా పడ్డ పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇక సెకండరీ గ్రేడ్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ కి దేశ వ్యాప్తంగా సెలవులు ఇస్తున్నారు, పిల్లలకు ఈ వ్యాధి వస్తే అంత తొందరగా తగ్గదని , పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి విద్యార్దులకి సెలవులు ప్రకటించారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్ కాలేజీకు కూడా ఇక్కడ ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.
ఈ క్రింది వీడియో చూడండి