నోయల్ బయోగ్రఫీ 1982 నుండి ప్రస్తుతం…

1408

నోయెల్ సీన్ 1982 నవంబర్ 28 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాద్‌లో శామ్యూల్, సారా దంపతులకు జన్మించాడు. అతని తండ్రి పదవీవిరమణ చేసిన సైనికొద్యోగి, తల్లి గృహిణి. నోయెల్ కు మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. రక్షణ రంగానికి చెందిన కుటుంబానికి చెందిన వ్యక్తి నోయెల్ సీన్

10 వ తరగతి వరకు డిఎల్ఎస్ ఆర్‌సిఐ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్) లో చదువుకున్నాడు. అతను డిఫెన్స్ లాబొరేటరీ కళాశాలలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసాడు.  ఎస్.వి.సి.ఎఫ్.ఎ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని అభ్యసించాడు. తరువాత  వెబ్ డిజైనర్ అయ్యాడు.  చిత్ర పరిశ్రమలో చేరే వరకు కాగ్నిజెంట్ లో ట్రైనీగా పనిచేశాడు.

నోయెల్ సీన్ చదువుకునే సమయంలో అతను గుర్తింపు పొందిన ఆర్చరీ  ట్రైనర్  రవిశంకర్ ను కలుసుకున్నాడు. రవిశంకర్ నోయల్ ని సినీ రంగంలోకి వెళ్ళేందుకు ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ కు కాస్టింగ్ దర్శకునిగా పనిచేస్తున్న రామానంద్ కు పరిచయం చేసాడు.

అతనికి మొదటి సారి తెలుగు సినిమా పరిశ్రమలొ సంభవామి యుగే యుగే లో నటించే అవకాశం కలిగింది. తరువాత  దర్శకుడు కృష్ణకు పరిచయమయ్యాడు. అతను నోయల్ ను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి పరిచయం చేసాడు. కీరవాణి అతనికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా విక్రమార్కుడు లో ర్యాపింగ్ చేసే అవకాశం కల్పించాడు. ఇది నోయల్ కు భారీ గుర్తింపు తెచ్చి పెట్టింది.

‘మొదటి తెలుగు రాపర్’ గా గుర్తించారు. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. 2007 లో, నోయెల్ చార్మి కౌర్‌తో కలిసి మంత్ర చిత్రంలో తెరపై కనిపించాడు. అదే సమయంలో నోయెల్ 93.5 రెడ్ ఎఫ్ఎమ్ కోసం రేడియో జాకీగా పనిచేసాడు. ఆ క్రమంలో అతను అనేక మంది అభిమానులను పొందాడు. ఆ తరువాత అతను అనేక పెద్ద ప్రాజెక్టులలో వరుసగా అనేక ముఖ్యమైన పాత్రలను పోషించాడు.

తెలుగు చలనచిత్రంలో బహుముఖ నటుడిగా స్థిరపడ్డాడు. 2015 లో, నోయెల్ నటుడిగా అందరూ గుర్తించారు. అతను దర్శకుడు సుకుమార్ నిర్మాణంలోని సినిమా కుమారి 21 ఎఫ్ కు సంతకం చేసాడు. ఈ సినిమాలో అతను శంకర్ అనే ప్రతినాయకుని పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో అతని నటన విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అతను త్వరలోనే హెబా పటేల్ సరసన నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో కథానాయకునిగా అడుగుపెట్టాడు. ఈ చిత్రం బాగా విజయవంతమైంది. ఇది అతని కెరీర్ లో మరొక విజయవంతమైన సినిమాగా చేరింది.

నోయెల్ 2010 లో జీ తెలుగులో సా రే గా మా పా లిల్ చాంప్స్తో టెలివిజన్ వ్యాఖ్యాతగా అడుగుపెట్టాడు. 2013 లో జెమిని టీవిలో సూపర్ కుటుంబం లో వ్యాఖ్యాతగా చేసాడు.

నోయెల్ అనేక స్వతంత్ర పాటలను స్వరపరచి, వాటిని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేశాడు. అతను గుర్తింపు పొందిన గీత రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి ‘ది షేక్ గ్రూప్’ అనే తెలుగు బ్యాండ్‌ను ఏర్పాటు చేశాడు. గాయకులు రమ్య బెహారా, మోహనా, దామిని, మౌనిమా, ఆదిరే అభి, ఆదిత్య, అరుణ్ కూడా ఈ బృందంలో ఒక భాగంగా ఉన్నారు.

ఎస్తర్ తో కలిసి  అతని తాజా వీడియో డెస్పాసిటో తెలుగు కవర్ ర్యాప్ పాటను తెలుగులో చేసాడు. అది వైరల్ అయ్యింది. 2 వారాలలోపు 1 మిలియన్ వీక్షణలను దాటింది. అతను కొంకణి సంగీత పరిశ్రమలో ఈస్టర్ నోరోన్హా చే చేయబడిన డిస్పాసిటో కొంకణి కవర్ వెర్షన్ ద్వారా ర్యాపర్ గా చేరాడు.

అతను 2019 జనవరి 3న సినిమా నటి ఈస్టర్ నోరోన్హాను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జూన్ 2019 లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు వారిరువురికీ విడాకులు మంజూరు చేసింది.

పగ పట్టిన కోడి… ఏం చేసిందో తెల్సిస్తే షాక్ అవాల్సిందే

డిసెంబర్ 1 వరకు మళ్ళి లాక్ డౌన్ ఫాన్స్ ప్రధాని సంచలన ప్రకటన

పెళ్లి డేట్ ఫిక్స్ టాలీవుడ్ పముఖ నటుడుని పెళ్లి చేసుకుంటున్న పునర్నవి

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి పై జీవిత ప్రకటన….

బిగ్ బాస్ అభిజిత్ గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు

Content above bottom navigation