డబ్బు లేదని లవ్ చేసిన అతన్ని రిజెక్ట్ చేసింది…భర్తతో ఉండగా అతను ఎదురైనప్పుడు ఏమైందో తెలుసా.?

75

ప్రేమంటే ఏమిటి.. ఈ ప్రశ్నను అడిగితే ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. ప్రేమ కోసం యుద్దాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే కొందరు తమకు ప్రపోజ్ చేసిన వారిని చాలా చులకనగా చూస్తారు. స్టాటస్ అంటూ ప్రేమను వ్యక్తపరిచిన వారిని చులకనగా చూసి వారి ప్రేమను అవమానిస్తారు. అలా ఒక బీదవాడి ప్రేమను అవమానించిన ఒక డబ్బు అహం ఉన్న అమ్మాయి కథ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

ఈ క్రింది వీడియో చుడండి

పేదవాడైన రాము అనే అబ్బాయి, ధనవంతురాలైన రాణి అనే అమ్మాయి ఫ్రెండ్స్. అతనిని ఆమె స్నేహితుడిగానే చూసింది. కానీ రాము ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమెనే లోకం అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మనసులో ఏముందో రాముకు తెలీదు. అందుకే తన ప్రేమ విషయం రాణికి తెలియాలని ఒకరోజు రాము తన ప్రేమ విషయం రాణికి చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి…. చూడు, నీ నెల జీతం నా ఒక్క రోజు పాకెట్ మనీ అంత ఉండదు. ఎలా అనుకున్నావ్, నేను నిన్ను ప్రేమిస్తానని? నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి? నన్ను చేసుకోవాలంటే అతనికో స్టేటస్ ఉండాలి. అందుకే నన్ను మర్చిపోయి, నీ లెవల్ కి తగ్గ వాళ్ళని చూస్కో అని చెప్పింది. కానీ అతను ఆ అమ్మాయిని అంత ఈజీగా మర్చిపోలేకపోయాడు. పది సంవత్సరాల తర్వాత ఒక షాపింగ్ మాల్ లో ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు. అమ్మాయి, ” ఎలా ఉన్నావు? నాకు పెళ్లయింది, నీకు తెలుసా? మా వారి సాలరీ ఎంతో ? నెలకి రెండు లక్షలు. నిన్ను చేసుకునుంటే నాకు ఇంత స్టేటస్ వచ్చేదా? అని అనింది.

ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతలో ఆమె భర్త అక్కడికి వచ్చాడు. ఆ అబ్బాయిని చూసి… “సార్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈమె నా భార్య ప్రియా. ప్రియా…ఈయన మా బాస్. ప్రియా.. నీకు తెలుసా? సార్ కి ఇంత స్టాటస్ ఉండి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సార్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారంట. కానీ అప్పుడు సార్ కి ఆస్తి లేదని అమ్మాయి కాదంది. ఎంత దురదృష్టం కదా అమ్మాయిది. సార్ ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు. ఈ రోజుల్లో సార్ లాంటి గొప్ప ప్రేమికులు ఎంత మంది ఉంటారు అని తన భార్యకు చెప్పాడు. అప్పుడు ఆమె తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే… ఈ రోజు నువ్వున్న స్థాయిని చూసి ఎప్పుడు గర్వపడకు. ఏ క్షణంలోనైనా తారుమారు అవ్వచ్చు. డబ్బును చూసి కాకుండా మనసును చూసి ప్రేమించండి. రాజు పేద కావచ్చు పేద రాజు కావచ్చు. అయినా ప్రేమించిన వారు దగ్గర ఉండటం కంటే మించిన ఆస్థి ఇంకోటి ఉంటుందా? చెప్పండి.

ఈ క్రింది వీడియో చుడండి

Content above bottom navigation