చైనా లో నర్సుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు

ప్రాణాంతక కరోనా వైరస్ చైనాలో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కాటుకు చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 550 కు చేరింది. శుక్ర‌వారానికి ఆ దేశంలో 30 వేల‌ కేసులు నమోదయ్యాయి.24 గంటల వ్యవధిలో మరో2000 మంది కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. మరో 5 వేల కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా వ్యాధి లక్షణాలున్న వారికి నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలు ఇంకా చాలా వ‌ర‌కూ అందలేదు. ఈ నివేదికలు కూడా అందితే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముంది.

Image result for చైనా లో నర్సుల

కరోనా వైరస్ బాధితుల కోసం చికిత్స కల్పించేందుకు 10 రోజుల్లోనే 1000 పడకలతో కూడిన భారీ ఆస్పత్రిని చైనా నిర్మించింది. ఇందులోని కరోనా వైరస్ బాధితులకు చికిత్స కల్పిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే 1500 పడకల వసతి కలిగిన మరో ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.కరోనా వైరస్ బారి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఆ దేశ నర్సులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారు. నిద్రాహారాలు మానుకుని రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే గడుపుతూ సేవలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రతి రోజూ రెండు మూడు గంటలు మాత్రమే నర్సులు నిద్రపోతున్నారు. రోజంతా మాస్క్‌లు వేసుకుని పనిచేయడంతో వారి చర్మం కందిపోతోంది. చేతులకు రోజంతా గ్లౌజులు వేసుకోవడంతో వారి చర్మం కందిపోతోంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు సేవలందిస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఏ మాత్రం విశ్రాంతి లేకుండా రోజంతా కష్టపడుతున్న చైనా నర్సులపై ఆ దేశంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ ప్రాణాంతకమని తెలిసినా…తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోజంతా నర్సులు సేవలందిస్తున్నారు. రోజంతా మాస్క్ వేసుకుని కరోనా వైరస్ బాధితులకు సేవలు అందించడంతో ఓ నర్సు దుస్థితి చూడండి ఆమె ముఖం మొత్తం కందిపోయింది.కరోనా వైరస్ బారినపడిన వారికి చికిత్స కల్పిస్తూ ఆస్పత్రిలోనే కాసేపు కునుకు తీస్తున్న వైద్యులని చూసి కుటుంబాలు కూడా బాధ‌ప‌డుతున్నాయి, అలాగే అక్క‌డ అన్నీ ఆస్ప‌త్రిల్లో 24 గంట‌లు సేవ‌లు అందిస్తున్నారు, అక్క‌డే చీఫ్ డాక్ట‌ర్లు కూడా నిద్ర‌పోతున్నారు. ప్ర‌తీ వంద మంది న‌ర్సుల్లో 50 మంది వ‌ర‌కూ అల‌స‌ట‌గానే ఉంటున్నారు, వారి ముఖం చేతులు కాళ్లు కందిపోతున్నాయి, వారి రూపు మొత్తం మారిపోయింది.. నిజంగా అక్క‌డ న‌ర్సుల‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation