నూజివీడు ట్రిపుల్ ఐటీ లేడీస్ హాస్టల్ ఘటన.. తప్పు ఎవరిది? సెక్యూరిటీ నిద్రపోతున్నారా

124

ఓ వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత అమ్మాయిని అయినా అబ్బాయిని అయినా త‌ల్లి దండ్రులు క‌నిపెట్టుకోవాలి
యుక్త‌వ‌య‌సులో వారి కోరిక‌లు చివ‌ర‌కు జీవితాల‌నే నాశ‌నం చేస్తాయి విద్యాల‌యాల్లో విద్యాకుసుమాలు విక‌సించ‌డం ఎలా ఉన్నా.. విష సంస్కృతికి పాల్ప‌డుతున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్ … 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్‌. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా ఓ అబ్బాయి దర్జాగా లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించాడు. గంట కాదు.. రెండు గంటలు కాదు. ఏకంగా 24 గంటలు.. లేడీస్ హాస్టల్‌ రూమ్‌లోనే ఆ అమ్మాయితో ఉన్నాడు. అయినా ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు… ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. క్యాంపస్‌లోని సెక్యూరిటీ లోపాలను ఎత్తి చూపింది. అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేలా చేసింది.నూజివీడులో ట్రిపుల్ ఐటీలో అసలేం జరుగుతోంది? ఇక్కడ చదువుకునే బాలికల భద్రత గాలిలో దీపంలా మారిందా? అంటే అవుననే అనిపిస్తోంది.

ఒక పగలు.. ఒక రాత్రి.. లేడీస్‌ హాస్టల్‌లోని గదిలో జెంట్‌ ఉండగలిగాడంటే ఇక్కడి సెక్యూరిటీ ఎంత నిర్లక్ష్యంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే..ఇంత జరిగినా… తోటి విద్యార్థినులు కాలేజీ సిబ్బందికి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? దాని వెనకున్న కారణాలేంటి? అసలు. హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, వార్డెన్ ఏం చేస్తున్నారు? ఇవే అంశాలు ఇపుడుచర్చనీయాంశమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.ట్రిపుల్‌ ఐటీలో సీటంటే మాటలు కాదు. మెరిట్ విద్యార్థులు మాత్రమే ఇక్కడ సీటు సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ చదివితే తమ పిల్లల భవిష్యత్ బంగారంలా ఉంటుందని తల్లిదండ్రులు కూడా నమ్ముతారు. అదే నమ్మకంతో తమ బిడ్డలను ఇక్కడికి పంపిస్తారు. కానీ… ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు…. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడాల్సిన సెక్యూరిటీ సిబ్బంది… భద్రతను మరిచిపోతున్నారు.వంద ఎకరాల్లోని నూజివీడు ట్రిపుల్ ఐటీకి మొత్తం 300మంది సెక్యూరిటీ ఉంటారు. వీరిలో 200మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వీరికి తోడు రాత్రి సమయంలో మరో 50 మంది పహారా కాస్తుంటారు.

ఈ క్రింది వీడియో చూడండి

దీంతో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోవాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతోంది. తమ బిడ్డలను కలిసేందుకు వచ్చే తల్లిదండ్రులను సవాలక్ష ప్రశ్నలు వేసే సెక్యూరిటీ సిబ్బంది… ఏకంగా ఓ విద్యార్థి… అమ్మాయిల హాస్టల్‌లోకి అడుగుపెడుతుంటే ఏం చేస్తున్నారన్న దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవమేంటన్న ప్రశ్నలు వ‌స్తున్నాయి.నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉండే లేడీస్‌ హాస్టల్‌ గదిలోకి ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రవేశించి గంటలపాటు లోపలే ఉండటం సంచలనంగా మారింది. క్యాంపస్ లో ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ టెక్‌జెట్‌-20 కార్యక్రమం నిర్వహించారు. 16వ తేదీ అందరూ కార్యక్రమం ముగింపు హడావిడిలో ఉండగా.. అర్ధరాత్రి సమయంలో కె-3 బ్లాక్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని విద్యార్థినుల గదిలోకి ఇంజనీరింగ్‌ ఫస్టియర్ విద్యార్థి ప్రవేశించాడు. ఆ రూమ్‌లో తన గర్ల్ ఫ్రెండ్ తో ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఈ విషయం ఆమెతో ఉండే తోటి విద్యార్థినులకు తెలిసినా బయటకు చెప్పలేదు. పైగా గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయి వారికి సహకరించారు. విషయం బయటకు పొక్కడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ రూమ్‌ తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. లోపల ఉన్న అన్ని మంచాల కింద చూశారు. ఈ క్రమంలో ఓ మంచం కింద దాక్కున్న యువకుడిని చూసి కంగుతిన్నారు.వాస్త‌వ‌మే 7000 మంది విద్యార్దులు ఉన్నారు …విద్యార్దులు కూడా స‌మ్ర‌మ బుద్దితో ఉండాలి,24 గంట‌లు వీరు ఏం చేస్తున్నారో చూసే వారు ఉండ‌రు క‌దా..కొంద‌రు ఇలాంటి ఆలోచ‌న‌లు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తెచ్చుకోవాలి అంటున్నారు పోలీసులు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation