వీడియో: ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కొడుకును చూశారా.. ఎంత ముద్దుగున్నాడో..!!

టాలీవుడ్ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కి రెండో కొడుకు పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తూనే మరొకపక్క సినిమాలు చేస్తూ బిజిబిజిగా ఉన్నాడు. అలాగే టైమ్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మనం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాను, ఇద్దరు కూతుళ్ళనే చూసాం కానీ పవన్ కళ్యాణ్ రెండవ కొడుకు ఎలా ఉంటాడో చూడలేదు. ఎప్పుడు పుట్టినప్పటి ఫోటో తప్ప ఇంకే ఫోటోలు గానీ, వీడియోలు కానీ బయటకు రాలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండవ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

మార్క్ శంకర్ పవనో విచ్, తెల్లని కుర్తా పైజమా ధరించి, సందడి చేస్తున్న ఈ వీడియో చూసిన మెగా, పవర్ స్టార్ ఫాన్స్ మాకో బుల్లి పవర్ స్టార్ దొరికేశాడంటూ తెగ ఆనందపడిపోతున్నారు. క్యూట్ గా కనిపిస్తూ, చూస్తున్న అందరి హృదయాలనూ కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడీ బుల్లి హీరో. కుర్తాపై జనసేన పార్టీ లేబుల్ కూడా కనిపిస్తోంది. ఈ లిటిల్ పవర్ స్టార్ ముఖంలో అటు పవన్, ఇటు లెజినోవా పోలికలు కనిపిస్తూ ఉన్నాయని ఫ్యాన్స్ కితాబునిస్తున్నారు. మరి మీరు కూడా ఆ వీడియో చూసెయ్యండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation