యజమాని కోసం తన ప్రాణాలు వదిలిన శునకం.. తట్టుకోలేక కన్నీరుమున్నీరైన కుటుంబం..

కుక్క అంటేనే విశ్వాసానికి మరో పేరు.మనుషులకు లేని విశ్వాసం కూడా కుక్కకు ఉంటుంది. చాలామంది యజమానులు పెంపుడు కుక్కలతో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉంటారు. అవి కూడా వారి పట్ల అంతే విశ్వాసంతో ఉంటాయి. రాత్రిపూట ఇంటి గేటు వద్ద ఏ చిన్న అలికిడి అయిన వెంటనే కుక్క తన యజమానిని అప్రమత్తం చేస్తాయి. అంతేనా ఒకవేళ రాత్రి వేళ యజమాని బయటకెళ్లినా పెంపుడు కుక్క కూడా వెంటే బయలుదేరుతుంది. దారి పొడవునా వీధి కుక్కలను నిలువరిస్తూ.. తిరిగి ఇల్లు చేరేదాక యజమానికి ఏ ఆపద రాకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాంటి ఓ కుక్క తన యజమానికి కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

పాము కాటుకు బలైన శునకం

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన కిశోర్ అనే వ్యక్తి.. తమ ఇంట్లో చాలాకాలంగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. కుక్క అన్న మాటే గానీ.. కుటుంబ సభ్యుల్లో అదీ ఒకరిగా కలిసిపోయింది. ఆ కుటుంబంలో అందరు ఎలాంటి ఫుడ్ తింటారో, దానికి కూడా ఆ ఫుడ్ నే పెడతారు. తమ పక్కనే ఆ కుక్కను కూడా పడుకోబెట్టుకుంటారు. అంత ప్రేమగా ఆ కుక్కను చూసుకుంటారు. ఆ కుక్క ఆ కుటుంబ సభ్యుల పట్ల ఎంతో విశ్వసంగా ఉంటుంది. అలాంటి కుక్క శనివారం రాత్రి పాము కాటుకు బలైపోయింది. యజమాని ప్రాణాలను రక్షించేందుకు పాముతో చివరిదాకా పోరాడిన ఆ కుక్క చివరకు ప్రాణాలు వదిలింది. శనివారం సాయంత్రం కిశోర్ తన ఇంటిలోని వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ తాచు పాము అతని మంచం కిందకు దూరడాన్ని ఆ పెంపుడు కుక్క గమనించింది. వెంటనే కిశోర్ గదిలోకి వచ్చి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే కుక్క ఎందుకు అరుస్తుందో తెలియక కుటుంబ సభ్యులు అరవద్దని గట్టిగా చెప్పారు. అయినా కూడా ఆ కుక్క అలాగే అరిచింది. ఆ అరుపులకు నిద్ర లేచిన కిశోర్ మంచం కింద పామును చూసి షాక్ తిన్నాడు.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

అయితే పామును చూసిన భయంతో కిషోర్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఇంట్లో ఆ పాము ఉంటె కుటుంబ సభ్యులకు ప్రమాదం అని ఆ కుక్క గ్రహించి ఆ పామును నోట కరిచి బయటకు లాక్కెళ్లింది. అనంతరం కిశోర్ ఓ కర్రతో పామును కొట్టి చంపాడు. అయితే కుక్క పామును నోట కరిచిన సమయంలోనే అది దాన్ని కాటువేసింది. పాము కాటుకు పెంపుడు కుక్క నురుసులు కక్కింది. పామును చంపేశాక కిశోర్ కుక్కను తన బైక్‌పై సమీపంలోని పశు వైద్యశాలకు తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో అది మరణించింది. తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మరీ తనను కాపాడిన కుక్క మరణించడం కిశోర్‌ ను కంటతడి పెట్టించింది. కిశోర్ భార్య,కుటుంబ సభ్యులు కూడా దాని మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు.

Content above bottom navigation